13 నుంచి ఐలోని మల్లన్న జాతర.. CM KCRకు ఆహ్వానం
ఆలయ అభివృద్ధికి సీఎం హామీ విధాత, వరంగల్: ఈనెల 13నుంచి ప్రఖ్యాత ఐనవోలు శ్రీమల్లికార్జున స్వామి జాతర జరగనున్నది. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేశారు. జాతర ఈ నెల 13నుంచి ఉగాది వరకు జరగనున్నది. బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో రానున్న నేపథ్యంలో చేపడుతున్న ఏర్పాట్లపై మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే, కలెక్టర్, సీపీ ఇతర అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు. జాతర ఏర్పాట్లు ఎమ్మెల్యే ఆరూరి పరిశీలించారు. జాతరకు వచ్చే భక్తులకు […]

- ఆలయ అభివృద్ధికి సీఎం హామీ
విధాత, వరంగల్: ఈనెల 13నుంచి ప్రఖ్యాత ఐనవోలు శ్రీమల్లికార్జున స్వామి జాతర జరగనున్నది. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అందజేశారు. జాతర ఈ నెల 13నుంచి ఉగాది వరకు జరగనున్నది. బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో రానున్న నేపథ్యంలో చేపడుతున్న ఏర్పాట్లపై మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యే, కలెక్టర్, సీపీ ఇతర అధికారులతో సమావేశం నిర్వహించి సమీక్షించారు.
జాతర ఏర్పాట్లు ఎమ్మెల్యే ఆరూరి పరిశీలించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. అన్ని శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పని చేసి జాతరను విజయవంతం చేయాలని కోరారు. మండల ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ఆలయ ఈవో, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్‌కు జాతర ఆహ్వానం
సోమవారం ప్రగతి భవన్ లో సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు జాతర ఆహ్వాన పత్రికను అందించారు. జాతరకు హాజరు కావాల్సిందిగా సీఎంను కోరారు.
ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు సీఎం కేసీఆర్ కు వేద మంత్రాలతో ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం ఆలయ అభివృద్ధికి ప్రత్యేక దృష్టితో నిధులు కేటాయించాలని సీఎం కేసీఆర్‌కు వినతి పత్రం అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలయ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికాభివృద్ధి చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, ఆలయ ఈఓ నాగేశ్వర రావు, ఆలయ మాజీ చైర్మన్ మునిగాల సమ్మయ్య, ప్రధాన అర్చకులు రవీందర్, విక్రాంత్ జోషి, మధుకర్ శర్మ, పురుషోత్తమ శర్మ పాల్గొన్నారు.