Kamareddy | తృటిలో తప్పిన ప్రమాదం.. ఎయిర్ గన్ పేలి ఒకరికి తీవ్ర గాయాలు

Kamareddy | విధాత ప్రతినిధి, ఉమ్మడి నిజామాబాద్: ఎయిర్ గన్ పేలి ఒకరికి తీవ్ర గాయాలపాలైన సంఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం శేట్‌పల్లి సంగారెడ్డి గ్రామ శివారులోని చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పోలీసులు, బాధితుని కథనం ప్రకారం శేట్‌పల్లి గ్రామ శివారులో హైదరాబాద్ ప్రాంతానికి చెందిన వ్యక్తి వ్యవసాయ క్షేత్రంలో శ్రీకాంత్ అనే వ్యక్తి వ్యవసాయ క్షేత్రంలో సూపర్ వైజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. తన స్నేహితుడైన రాజును వ్యవసాయ […]

Kamareddy | తృటిలో తప్పిన ప్రమాదం.. ఎయిర్ గన్ పేలి ఒకరికి తీవ్ర గాయాలు

Kamareddy |

విధాత ప్రతినిధి, ఉమ్మడి నిజామాబాద్: ఎయిర్ గన్ పేలి ఒకరికి తీవ్ర గాయాలపాలైన సంఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం శేట్‌పల్లి సంగారెడ్డి గ్రామ శివారులోని చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

పోలీసులు, బాధితుని కథనం ప్రకారం శేట్‌పల్లి గ్రామ శివారులో హైదరాబాద్ ప్రాంతానికి చెందిన వ్యక్తి వ్యవసాయ క్షేత్రంలో శ్రీకాంత్ అనే వ్యక్తి వ్యవసాయ క్షేత్రంలో సూపర్ వైజర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

తన స్నేహితుడైన రాజును వ్యవసాయ క్షేత్రానికి తీసుకువెళ్లి వ్యవసాయ క్షేత్ర యజమానికి చెందిన ఎయిర్ గన్ పనితీరును వివరిస్తున్న సమయంలో ఒక్కసారిగా ఎయిర్ గన్ పేలి బుల్లెట్ రాజు వీపు భాగంలోకి దూసుకెళ్లింది. దీంతో రాజు వీపు భాగంలో తీవ్ర గాయమైంది.

వెంటనే గమనించిన శ్రీకాంత్ చికిత్స నిమిత్తం నాగిరెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్లాడు. కాగా.. పరిస్థితి తీవ్రంగా ఉండడంతో స్థానికుల సహయంతో శస్త్ర చికిత్స నిమిత్తం హైదరాబాదులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం రాజు హైదరాబాదులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.

వ్యవసాయ క్షేత్రానికి ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు, లింగంపేట,ఎల్లారెడ్డి ఎస్ఐలు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం శ్రీకాంత్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు లింగంపేట్ ఎస్ఐ తెలిపారు.