ఆ హ్యాండ్ పంప్ నుంచి నీళ్ల‌కు బ‌దులు ఆల్క‌హాల్.. ఇది పెద్ద క‌థే..!

విధాత: బోరింగ్ ద్వారా నీళ్లు వ‌స్తాయ‌ని మ‌న‌కు తెలిసిన విష‌యం. కానీ ఆ బోరింగ్‌లో మాత్రం నీళ్ల‌కు బ‌దులుగా ఆల్క‌హాల్ వ‌స్తుంది. భూమిలో నుంచి ఆల్క‌హాల్ రావ‌డం ఏంట‌ని అనుకోవ‌చ్చు. కానీ దీని వెనుకాల పెద్ద క‌థే ఉంది. ఆ గ్రామ‌స్తుల తెలివిని మెచ్చుకోవాల్సిందే. మ‌రి ఆ క‌థేంటో తెలుసుకుందాం.. మ‌ధ్య‌ప్ర‌దేశ్ గుణ జిల్లాలోని భాన్‌పురా గ్రామంలో అక్ర‌మంగా మ‌ద్యం వ్యాపారం చేస్తున్నారు. ఈ వ్యాపారంపై పోలీసుల‌కు ప‌క్కా స‌మాచారం అందింది. దీంతో పోలీసులు ఆ గ్రామంలో […]

ఆ హ్యాండ్ పంప్ నుంచి నీళ్ల‌కు బ‌దులు ఆల్క‌హాల్.. ఇది పెద్ద క‌థే..!

విధాత: బోరింగ్ ద్వారా నీళ్లు వ‌స్తాయ‌ని మ‌న‌కు తెలిసిన విష‌యం. కానీ ఆ బోరింగ్‌లో మాత్రం నీళ్ల‌కు బ‌దులుగా ఆల్క‌హాల్ వ‌స్తుంది. భూమిలో నుంచి ఆల్క‌హాల్ రావ‌డం ఏంట‌ని అనుకోవ‌చ్చు. కానీ దీని వెనుకాల పెద్ద క‌థే ఉంది. ఆ గ్రామ‌స్తుల తెలివిని మెచ్చుకోవాల్సిందే. మ‌రి ఆ క‌థేంటో తెలుసుకుందాం..

మ‌ధ్య‌ప్ర‌దేశ్ గుణ జిల్లాలోని భాన్‌పురా గ్రామంలో అక్ర‌మంగా మ‌ద్యం వ్యాపారం చేస్తున్నారు. ఈ వ్యాపారంపై పోలీసుల‌కు ప‌క్కా స‌మాచారం అందింది. దీంతో పోలీసులు ఆ గ్రామంలో వాలిపోయారు. స్థానికంగా ఏర్పాటు చేసిన ఓ హ్యాండ్‌పంప్‌పై పోలీసుల దృష్టి ప‌డింది. ఆ పంపును ప్రెస్ చేయ‌గా, నీళ్ల‌కు బ‌దులుగా సారా బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీంతో ఆ ఏరియాను క్షుణ్ణంగా ప‌రిశీలించారు.

ఇక సారా వ్యాపారం చేసుకుంటున్న కొంత‌మంది త‌మ భూముల్లో పెద్ద పెద్ద డ్ర‌మ్ముల్లో ఆ లిక్క‌ర్‌ను నిల్వ ఉంచిన‌ట్లు తేలింది. ఎవ‌రికీ అనుమానం రాకుండా ఆ డ్ర‌మ్ముల‌ను భూముల్లో గుంత‌లు తీసి పూడ్చిపెట్టారు. అయితే ప్రతిసారి ఆ డ్ర‌మ్ముల వ‌ద్ద‌కు వెళ్ల‌కుండా ఆ గ్రామ‌స్తులు తెలివిగా ఆలోచించారు.

డ్ర‌మ్ముల‌కు ఓ బోరింగ్‌ను అనుసంధానం చేశారు. అవ‌స‌ర‌మైన‌ప్పుడల్లా.. బోరింగ్ ద్వారా సారాను తీసుకుని విక్ర‌యిస్తున్న‌ట్లు పోలీసులు గుర్తించారు. ఈ అక్ర‌మ వ్యాపారం చేస్తున్న 8 మంది ప‌రారీలో ఉన్నారు. వారిని ప‌ట్టుకునేందుకు పోలీసులు గాలింపు చ‌ర్య‌లు ముమ్మ‌రం చేశారు.