Alexa | అలెక్సా వాడుతున్నారా..? ఇకపై ఈ డివైజెస్‌లో సేవలను నిలిపివేసిన గూగుల్‌..! మరి ఏం చేయాలో తెలుసా..?

Alexa | అలెక్సా వాడుతున్నారా..? ఇకపై ఈ డివైజెస్‌లో సేవలను నిలిపివేసిన గూగుల్‌..! మరి ఏం చేయాలో తెలుసా..?

Alexa | అమెజాన్‌ సర్వీసెస్‌ వాడుతున్న వారికి అలెక్సా అందరికీ సుపరిచతమే. సెర్చింగ్‌, స్మార్ట్‌ హోం సర్వీసెస్‌ తదితర సర్వీసులకు అలెక్సా వాయిస్‌ అసిస్టెంట్‌ సేవలను వినియోగిస్తుంటారు. అయితే లెగసీ నెస్ట్‌ స్కిల్స్‌కు సర్వీసెస్‌ సపోర్ట్‌ను నిలిపివేస్తున్నట్లు గూగుల్ వెల్లడించింది. అలెక్సా అనేది వాసిస్‌ నియంత్రిత వర్చువల్‌ అసిస్టెంట్‌. హోమ్‌ను నియంత్రించగలగడంతో పాటు మీరు అడిగే ప్రశ్నలకు సైతం సమాధానం ఇవ్వడంతో పాటు తదితర సేవలను సైతం అందిస్తున్నది. అయితే, గూగుల్ లెగసీ నెస్ట్ కిట్ ద్వారా అలెక్సా సేవలు ఈ నెల 29 నుంచి నిలిచిపోనున్నాయి. అయితే, నిరంతరాయంగా ఆ సేవలను పొందాలనుకునేవారికి కొన్ని చిట్కాలు పాటిస్తే ఎలాంటి అవాంతరయం లేకుండా అలెక్సా సేవలను పొందే వీలుంది. అలెక్సా సేవలు కావాలనుకునే వారు వెంటనే గూగుల్ నెస్ట్ కిట్ నుంచి గూగుల్ నెస్ట్ స్కిల్ ఫర్ అలెక్సాకు మారాలి. ఈ విషయాన్ని గూగుల్‌ పేర్కొంది.

అలెక్సాకు మారాలంటే..

మొదట మీ స్మార్ట్‌ఫోన్‌లో అలెక్సా యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకొని ఓపెన్‌ చేయాలి. మొదట ట్యాప్‌ మోర్‌ బటన్‌పై క్లిక్‌ చేయాలి. ఇందులో స్కిల్స్‌ అండ్‌ గేమ్స్‌ను సెలెక్ట్‌ చేసుకోవాలి. ఆ తర్వాత ఫైండ్‌ యువర్‌ స్కిల్స్‌ను ఎంపిక చేసుకోవాలి. అనంతరం ఫైండ్‌ నెక్స్‌ట్‌ అలెక్సాను సెలెక్ట్‌ చేసి డిసేబుల్‌ చేయాలి. అలెక్సా యాప్‌లోని అన్ని నెస్ట్ డివైజెస్‌ను రిమూవ్ చేయాలి. గూగుల్ హోం యాప్‌లో న్యూ గూగుల్‌ నెస్ట్‌ అలెక్సా స్కిల్‌ను ఎనేబుల్‌ చేయాలి. అందుకు తొలుత గూగుల్ హోం యాప్‌లో కింద భాగంలో ఉన్న సెట్టింగ్స్‌ను ఓపెన్ చేయాలి. ఆ తర్వాత ప్లస్‌ ఐకాన్‌పై ట్యాప్ చేయాలి. సర్వీసెస్‌ను ఎంపిక చేసుకుని.. అందులో ఆమెజాన్ అలెక్సా స్కిల్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత అలెక్సా యాప్‌ను ఓపెన్ చేసి, యాక్టివేట్ చేసుకోవాలి.