Viral Video | ముద్దులొలికే చిన్నారి.. అలెక్సాను ఏం అడిగింది?

విధాత‌: సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ (Viral Video) అయ్యే అన్ని వీడియోలు ఒక ఎత్తు.. చిన్నారుల సరదా ప్రయత్నాలు ఒక ఎత్తు. ఎందుకంటే.. చిట్టిపాపలు ఏం చేసినా హృద్యంగా ఉంటుంది. ముద్దుముద్దుగా పలికే మాటలు మనసుకు ప్రశాంతతనిస్తాయి. తమకు చేతకాకపోయినా ఒక పని చేయాలని చేసే ప్రయత్నాలు ముచ్చటగొల్పుతాయి. View this post on Instagram A post shared by Nepali Videos Official (@videos.nep) ఈ చిన్నారి ప్రయత్నం సామాజిక మాధ్యమాల్లో […]

  • By: Somu    latest    May 15, 2023 10:57 AM IST
Viral Video | ముద్దులొలికే చిన్నారి.. అలెక్సాను ఏం అడిగింది?

విధాత‌: సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ (Viral Video) అయ్యే అన్ని వీడియోలు ఒక ఎత్తు.. చిన్నారుల సరదా ప్రయత్నాలు ఒక ఎత్తు. ఎందుకంటే.. చిట్టిపాపలు ఏం చేసినా హృద్యంగా ఉంటుంది. ముద్దుముద్దుగా పలికే మాటలు మనసుకు ప్రశాంతతనిస్తాయి. తమకు చేతకాకపోయినా ఒక పని చేయాలని చేసే ప్రయత్నాలు ముచ్చటగొల్పుతాయి.

ఈ చిన్నారి ప్రయత్నం సామాజిక మాధ్యమాల్లో నెటిజన్ల నుంచి ముద్దులు మూటగట్టుకున్నది. ఇంతకీ ఆ చిన్నారి అలెక్సాను ఏం అడిగింటే.. తనకు నచ్చిన ఒక పాటను ప్లే చేయమని! పాపం.. ఆ చిన్నారి.. ముద్దుముద్దుగా పలికే పదాలు అలెక్సాకు అర్థం కాలేదు. ఆ చిన్నారికి ఫేవరెట్‌ సాంగ్‌ ‘యామ్‌ ఆన్‌ వెకేషన్‌..’ కానీ.. దానిని పలకడం ఆ బుజ్జికన్నకు రాలేదు.

దీంతో అలెక్సా స్పందించలేదు. పాపం.. ఆ చిట్టితల్లి నిరాశకు గురై అమ్మకేసి చూసింది. అయినా.. నెట్టింట మాత్రం నవ్వులు పూయించింది. ముద్దులు కురిపించింది. సో క్యూట్‌ అంటూ కామెంట్లు వెల్లువెత్తాయి.