నవ్వలేక నవ్వుతున్న ఆలీ.. దంచినమ్మకు బుక్కిందే కూలీ!

ఉన్నమాట: సినీనటుడు ఆలీకి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచి ప్రాధాన్యం దక్కుతుందని చాలా మంది భావించినా మొత్తానికి ఏదో ఒక పోస్ట్ అయితే వచ్చింది. అది మంచిదా.. చెడ్డదా.. అలీ స్థాయికి సరిపోతుందా అన్న విషయాన్ని పక్కన బెడితే ఆ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవిని ఆలీ ఆనందంగా స్వీకరించారు. ఏంటి నిత్యామీనన్ పెళ్లి కాకుండానే తల్లి కాబోతోందా? అంటే జగన్ ఆఫర్ చేశారు కాబట్టి నచ్చినా.. నచ్చకున్నా అంగీకరించాల్సిన పరిస్థితి నెలకొన్నట్లు సోషల్ మీడియా […]

నవ్వలేక నవ్వుతున్న ఆలీ.. దంచినమ్మకు బుక్కిందే కూలీ!

ఉన్నమాట: సినీనటుడు ఆలీకి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచి ప్రాధాన్యం దక్కుతుందని చాలా మంది భావించినా మొత్తానికి ఏదో ఒక పోస్ట్ అయితే వచ్చింది. అది మంచిదా.. చెడ్డదా.. అలీ స్థాయికి సరిపోతుందా అన్న విషయాన్ని పక్కన బెడితే ఆ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవిని ఆలీ ఆనందంగా స్వీకరించారు.

ఏంటి నిత్యామీనన్ పెళ్లి కాకుండానే తల్లి కాబోతోందా?

అంటే జగన్ ఆఫర్ చేశారు కాబట్టి నచ్చినా.. నచ్చకున్నా అంగీకరించాల్సిన పరిస్థితి నెలకొన్నట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది. అందుకే కాదనలేకుండా లోలోన బాధ పడుతున్నా బయటికి మాత్రం అదేం కనబడనివ్వకుండా మహదానందంగా ఆ పదవిని స్వీరిస్తున్నట్లు ఆలీ కుటుంబం ప్రకటించింది.

కిచ్చా సుదీప్‌తో హీరోయిన్ మీనా సీక్రెట్ మ్యారేజ్.. అసలు విషయం ఏంటంటే?

ఈ సందర్భంగా తన భార్యతో కలిసి సెల్ఫీ వీడియో తీసుకున్న అలీ.. సీఎం జగన్ పై అభినందనల వర్షం కురిపించారు. పార్టీలో తాను పడిన శ్రమకు గుర్తింపు లభించిందన్నారు. ఇప్పటి వరకు పార్టీలో ఏ పదవినీ ఆశించకుండా పనిచేశానని కొన్నాళ్ల కిందట సీఎం జగన్ ఏది తనకు చెప్పారో అదే చేశారని అలీ అన్నారు.

జాన్వీ అంత మాట అనేసిందేంటి?.. రష్మిక, విజయ్‌ బంధం గురించి తెలిసేనా!

ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా తనను నియమించడం పట్ల తనకు ఎంతో సంతోషంగా ఉందని అలీ వ్యాఖ్యానించారు. ఇది తన కుమార్తె పెళ్లి సందర్భంగా సీఎం జగన్ ఇచ్చిన గొప్ప కానుక భావిస్తున్నట్టు పేర్కొన్నారు.

మనస్పూర్తిగా ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నట్టు చెప్పారు. తనకు లభించిన ఈ పదవిలో సంపూర్ణ న్యాయం చేసేందుకు తాను చిత్తశుద్దితో పనిచేస్తానని అలీ పేర్కొన్నారు. ఇక ఆయన సతీమణి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు తమకు వివిధ వర్గాల నుంచి ఫోన్లు వచ్చాయని.. పార్టీలో ఎన్నో ఏళ్లుగా ఉన్నా పదవి రాలేదనే చింత ఉండేదని చెప్పారు.

బైక్‌పై స్టంట్‌ చేస్తు.. ప్రీ వెడ్డింగ్ షూట్ (వీడియో వైరల్‌)

దీంతో ఎవరు అడిగినా ఏం చెప్పాలో తెలియక ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయన్నారు. కానీ.. ఇప్పుడు సీఎం జగన్ ఇచ్చిన పదవితో తమ చింత తీరిపోయిందని ఆనందం వ్యక్తం చేశారు. అయితే అలీ అభిమానులు మాత్రం ఆయన సర్దుకు పోయి ఉంటాడని వ్యాఖ్యానిస్తున్నారు.

రాత్రంతా సెలబ్రేట్ చేసుకున్నాం: నరేష్, పవిత్రా లోకేష్‌!

ముందుగా ప్రచారం జరిగిన మేరకు ఆయనకు ఇ ఎమ్మెల్సీనో రాజ్యసభ లేక వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి ఇస్తే బాగున్నని అంటున్నారు. ఇన్నాళ్లూ ఏదీ లేనిదానికన్నా చిన్నదో పెద్దదో ఏదోటి గుర్తింపు వచ్చింది..అది చాలని అలీ ఫీలవుతున్నట్లు తెలుస్తోంది.