పవన్ వైపు అలీ చూపు?
జగన్ దగ్గర మన్నన లేనందుకేనా ఉన్నమాట: ఇదిగో రాజ్యసభ.. అదిగో ఎమ్మెల్సీ.. కాసేపట్లో నామినేటెడ్ చైర్మన్ పదవి అంటూ సినీ నటుడు అలీని ఊరించిన పదవులేవి వాస్తవ రూపం దాల్చక పోవడంతో ఇప్పుడు ఆయన జనసేన వైపు చూస్తున్నారని అంటున్నారు. రాజకీయాల్లో ఎవరూ ఎవరికీ శాశ్వత విధేయులు ఉండరన్నది జగద్విదితం. అలీ కూడా గతంలో టీడీపీలో తిరిగారు.. చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడారు కానీ ఎక్కడా టికెట్ దక్కించు కోలేక చివరకు వైస్సార్సీపీలో చేరారు. ఇక్కడ జగన్ దగ్గర […]

జగన్ దగ్గర మన్నన లేనందుకేనా
ఉన్నమాట: ఇదిగో రాజ్యసభ.. అదిగో ఎమ్మెల్సీ.. కాసేపట్లో నామినేటెడ్ చైర్మన్ పదవి అంటూ సినీ నటుడు అలీని ఊరించిన పదవులేవి వాస్తవ రూపం దాల్చక పోవడంతో ఇప్పుడు ఆయన జనసేన వైపు చూస్తున్నారని అంటున్నారు. రాజకీయాల్లో ఎవరూ ఎవరికీ శాశ్వత విధేయులు ఉండరన్నది జగద్విదితం. అలీ కూడా గతంలో టీడీపీలో తిరిగారు.. చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడారు కానీ ఎక్కడా టికెట్ దక్కించు కోలేక చివరకు వైస్సార్సీపీలో చేరారు.
ఇక్కడ జగన్ దగ్గర కాస్త మర్యాద దక్కినట్లే అనిపించింది.. నేడో రేపో నామినేటెడ్ పోష్టులు రెడీ అంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ ఎన్నాళ్ళు నిరీక్షించినా అవేమి నిజం కాకపోవడంతో విసిగివేసారిన అలీ ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నారని అంటున్నారు. వాస్తవానికి తనతో మంచి సాన్నిహిత్యం ఉన్న అలీ ఉన్నఫలంగా 2019 ఎన్నికలకు ముందు అలీ జగన్‌ని కలసి వైసీపీలో చేరడంతో పవన్ షాక్ తిన్నారు.
తన పార్టీలో అలీ చేరుతారనుకుంటే ఇలా చేశారేంటి అని పవన్ ఆవేదన చెందారని కూడా చెబుతారు. వైసీపీలో చేరిన ఆలీ జనసేనాని మీద పదునైన విమర్శల బాణాలే సంధించారు. తాను సొంతంగా సినీ పరిశ్రమలో పైకి వచ్చానని అంటూ ఇండైరెక్ట్ గా పవన్ చిరంజీవి చలవతో ఎదిగారని కామెంట్స్ చేశారు. ఆ తరువాత ఇద్దరి మధ్యన ఎడం పెరిగింది.
2019 తరువాత పవన్ మళ్లీ సినిమాలు చేస్తున్నారు కానీ ఎక్కడా అలీని తీసుకోలేదు. అయితే రాజకీయాల్లో అవేమీ ఎల్లకాలం ఉండవు. అలీకి వైసీపీలో ఫ్యాన్ నీడన బాగా ఉక్కబోతగా ఉంది అంటున్నారు. పైగా వైసీపీ తరఫున నామినేటెడ్ పదవి అయినా దక్కుతుంది అనుకుంటే ఏదీ లేకుండా పోయింది.
వక్ఫ్ బోర్డు చైర్మన్ ఇస్తారని ప్రచారం జరిగింది అదీ లేదు.. ఆ మధ్యన రాజ్యసభ సీటు ఇస్తారని కూడా మీడియా కోడై కూసింది అదీ లేదు. దాంతో అలీ పూర్తిగా నిరాశకు గురి అయ్యారని అంటున్నారు. ఇది ఆయన ఆవేదన అయితే అలీ సొంత ప్రాంతం తూర్పు గోదావరి జిల్లాలో జనసేన బలంగా ఉంది. కొన్ని సీట్లను కూడా గెలుచుకుంటుదని అంచనాలు ఉన్నాయి.
దాంతో రాజమండ్రీకి చెందిన అలీ అక్కడ నుంచి పోటీ చేయడానికి జనసేనలో చేరవచ్చు అని ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే వైసీపీ నుంచి బయటకు వచ్చిన భక్తి ఛానల్ చైర్మన్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ కూడా పవన్ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.