మా వాడికే.. అన్ని అవార్డులు: విక్టరీ వెంకటేశ్‌ (వీడియో వైరల్)

విధాత‌: గత వారం రోజులుగా రామ్ చరణ్ పేరు వరల్డ్ వైడ్‌గా మారుమోగుతోంది. RRR హీరో ప్రతిభను పలువురు సినీ ప్రముఖులు కొనియాడుతున్నారు. ఇప్పటివరకు ఏ ఇండియన్ హీరోకి దక్కని గౌరవం రామ్ చరణ్‌కు దక్కింది. గుడ్ మార్నింగ్ అమెరికా షోలో పాల్గొన్న ఏకైక ఇండియన్ యాక్టర్‌గా రామ్ చరణ్ రికార్డు క్రియేట్ చేశారు. ఇక హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డ్స్‌కు అతిథిగా ఆహ్వానించబడ్డారు. ప్రత్యేకంగా స్పాట్‌లైట్ అవార్డుకు ఎంపికయ్యారు. అమెరికన్ ఆడియెన్స్‌లో రామ్ చరణ్ విపరీతమైన క్రేజ్‌ని […]

  • By: krs    latest    Mar 01, 2023 12:24 AM IST
మా వాడికే.. అన్ని అవార్డులు: విక్టరీ వెంకటేశ్‌ (వీడియో వైరల్)

విధాత‌: గత వారం రోజులుగా రామ్ చరణ్ పేరు వరల్డ్ వైడ్‌గా మారుమోగుతోంది. RRR హీరో ప్రతిభను పలువురు సినీ ప్రముఖులు కొనియాడుతున్నారు. ఇప్పటివరకు ఏ ఇండియన్ హీరోకి దక్కని గౌరవం రామ్ చరణ్‌కు దక్కింది. గుడ్ మార్నింగ్ అమెరికా షోలో పాల్గొన్న ఏకైక ఇండియన్ యాక్టర్‌గా రామ్ చరణ్ రికార్డు క్రియేట్ చేశారు. ఇక హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డ్స్‌కు అతిథిగా ఆహ్వానించబడ్డారు. ప్రత్యేకంగా స్పాట్‌లైట్ అవార్డుకు ఎంపికయ్యారు.

అమెరికన్ ఆడియెన్స్‌లో రామ్ చరణ్ విపరీతమైన క్రేజ్‌ని సొంతం చేసుకున్నాడు. నెక్స్ట్ ఆస్కార్ వేడుకల్లో కూడా రామ్ చరణ్ సందడి చేయనున్నారు. దీని కోసం రామ్ చరణ్ అమెరికాలోనే ఉన్నాడు. అక్కడ ఓ వెడ్డింగ్‌కి కూడా ఆయన హాజరయ్యాడు.

ఈ వెడ్డింగ్‌కు టాలీవుడ్ నుంచి ప్రత్యేకంగా విక్టరీ వెంకటేష్ సైతం హాజరు కావడం విశేషం. ఇక వధూవరులను పక్కనపెట్టి.. పెళ్లికి వచ్చిన బంధువులు రామ్ చరణ్, వెంకీలపైనే దృష్టి మళ్లించారు. ఈ సందర్భంగా రామ్ చరణ్‌ను ఉద్దేశిస్తూ వెంకటేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నాటు నాటు సాంగ్‌కి చరణ్‌తో కలిసి స్టెప్స్ వేసిన వెంకీ.. ఆ పాటకు వచ్చిన కొత్త జాతీయ గుర్తింపు గురించి మాట్లాడారు. మా వాడికే.. అన్ని అవార్డులు దక్కాలంటూ కోరారు. చరణ్ ఈ సందర్భంగా వెంకీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ వీడియో ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.