మార్చి 31(ఆదివారం) బ్యాంకులు తెరిచే ఉంటయ్.. ఆర్‌బీఐ వెల్లడి
ప్రతి ఆదివారం బ్యాంకులకు హాలిడే అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈ నెల 31వ తేదీన(ఆదివారం) బ్యాంకులు తెరిచే ఉంటాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) వెల్లడించింది

విధాత: ప్రతి ఆదివారం బ్యాంకులకు హాలిడే అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ ఈ నెల 31వ తేదీన(ఆదివారం) బ్యాంకులు తెరిచే ఉంటాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) వెల్లడించింది. ఎందుకంటే మార్చి 31న ఈ ఏడాది ఫైనాన్షియల్ ఇయర్‌లో చివరి రోజు. కాబట్టి అన్ని బ్యాంకు శాఖలను ఆ రోజున తెరిచి ఉంచాలని ఆర్‌బీఐ ఆదేశించింది. ఆర్బీఐ ఆదేశాల మేరకు మార్చి 31న బ్యాంకులు తెరిచే ఉంటాయి.
ఇది కాకుండా అన్ని ఏజెన్సీ బ్యాంకులు కూడా ఖాతాదారులకు, ప్రజలకు అందుబాటులో ఉంటాయి. తద్వారా రసీదులు, చెల్లింపులకు సంబంధించిన అన్ని ప్రభుత్వ లావాదేవీలు FY24లో నిర్వహించబడతాయి. ఈ నోటిఫికేషన్‌ను ఆర్‌బీఐ చీఫ్ జనరల్ మేనేజర్ సునీల్ టీఎస్ నాయర్ విడుదల చేశారు. మరోవైపు ఆర్థిక సంవత్సరం ముగింపు కారణంగా, ఆదాయపు పన్ను శాఖ తన అన్ని కార్యాలయాలకు సుదీర్ఘ వారాంతపు సెలవులను కూడా రద్దు చేసింది.