Rahul Gandhi | రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌ల‌న్నీ RSS, BJP బీజేపీ చేతుల్లోనే.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు

Rahul Gandhi | మోదీ ఆయ‌న‌కు అన్నీ తెలుస‌ని అనుకుంటారు దేవుడిని కూడా ఆయన కన్ఫ్యూజ్‌ చేయగలరు అమెరికా ప‌ర్య‌ట‌న‌లో.. ప్ర‌వాస భార‌తీయుల‌తో రాహుల్ గాంధీ విధాత: భార‌తదేశంలోని రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌ల‌న్నింటినీ బీజేపీ, ఆరెస్సెస్ నియంత్రిస్తున్నాయ‌ని కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) విమ‌ర్శించారు. అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆయన బుధ‌వారం కాలిఫోర్నియాలో ప్ర‌వాస భార‌తీయుల‌నుద్దేశించి ప్ర‌సంగించారు. ఓ ప్రేమ దుకాణం (మొహ‌బ్బ‌త్ కీ దుకాణ్‌) పేరుతో నిర్వ‌హించిన ఈ చ‌ర్చా గోష్ఠిలో రాహుల్‌ మాట్లాడుతూ… […]

Rahul Gandhi | రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌ల‌న్నీ RSS, BJP బీజేపీ చేతుల్లోనే.. రాహుల్ సంచలన వ్యాఖ్యలు

Rahul Gandhi |

  • మోదీ ఆయ‌న‌కు అన్నీ తెలుస‌ని అనుకుంటారు
  • దేవుడిని కూడా ఆయన కన్ఫ్యూజ్‌ చేయగలరు
  • అమెరికా ప‌ర్య‌ట‌న‌లో.. ప్ర‌వాస భార‌తీయుల‌తో రాహుల్ గాంధీ

విధాత: భార‌తదేశంలోని రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌ల‌న్నింటినీ బీజేపీ, ఆరెస్సెస్ నియంత్రిస్తున్నాయ‌ని కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) విమ‌ర్శించారు. అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆయన బుధ‌వారం కాలిఫోర్నియాలో ప్ర‌వాస భార‌తీయుల‌నుద్దేశించి ప్ర‌సంగించారు. ఓ ప్రేమ దుకాణం (మొహ‌బ్బ‌త్ కీ దుకాణ్‌) పేరుతో నిర్వ‌హించిన ఈ చ‌ర్చా గోష్ఠిలో రాహుల్‌ మాట్లాడుతూ… భార‌త్ జోడో యాత్ర మొద‌లు పెట్ట‌కముందు తాము చ‌ర్చించామ‌ని.. భార‌త రాజ‌కీయాల్లో గ‌తంలో ఉప‌యోగించిన విధానాలు ప్ర‌స్తుతం ప‌ని చేయ‌ట్లేద‌ని గుర్తించామ‌ని అన్నారు.

బ‌హిరంగ స‌భ‌లు, ప్ర‌జ‌ల‌ను క‌లుసుకుని మాట్లాడ‌టం వంటివి ఇక ఏ మాత్రం ఉనికిలో లేవ‌న్నారు. రాజ‌కీయాల్లో నెగ్గ‌డానికి కావ‌ల్సిన వ్య‌వ‌స్థ‌ల‌న్నీ బీజేపీ, ఆరెస్సెస్ గుప్పిట్లో ఉన్నాయ‌ని వ్యాఖ్యానించారు.
ఈ ప‌రిస్థితుల కార‌ణంగానే.. గ‌తానికి భిన్నంగా ద‌క్షిణం నుంచి ఉత్త‌ర భార‌తం వర‌కు జోడోయాత్ర చేయాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న జోడో యాత్ర‌లో త‌న అనుభ‌వాల‌ను పంచుకున్నారు. ‘నేను యాత్ర మొద‌లుపెట్టాక ఒక ఐదారు రోజుల‌కు 1000 కి.మీ. న‌డ‌వ‌డం కూడా సాధ్యం కాద‌నిపించింది. పైగా నా పాత మోకాలి గాయం తిర‌గ‌బెట్ట‌డం మొద‌లుపెట్టింది. ఏం చేయాలా అని ఆలోచిస్తూనే ముందుకు న‌డిచా.. అలా మూడు వారాల పాటు రోజుకి 25 కి.మీ. న‌డుస్తూ ప్ర‌జ‌ల‌ను క‌లుసుకునే స‌రికి నాకున్న ఇబ్బందుల‌న్నీ మాయ‌మైపోయాయి’ అని తెలిపారు.

యాత్ర‌లో భాగంగా తాను అన్ని కులాల వారిని, మ‌తాల వారిని క‌లిశాన‌ని, వారంతా ఒక‌రికొక‌రు సాయ‌ప‌డుతూ ఆనందంగా జీవిస్తున్నార‌ని తెలిపారు. భార‌త్ గురించి మీడియా చెప్పేదేదీ ప‌ట్టించుకోవ‌ద్ద‌ని, అవి బీజేపీకి అనుకూలంగా ఉండేలానే వార్త‌లు ఇస్తాయ‌ని రాహుల్ గాంధీ అన్నారు. జోడో యాత్ర అనుభ‌వాల‌తోనే ‘విద్వేష‌పు ప్ర‌పంచంలో ఓ ప్రేమ దుకాణం’ ఆలోచ‌న వ‌చ్చింద‌ని తెలిపారు.

దేవుడిని సైతం మోదీ క‌న్ఫ్యూజ్ చేస్తారు..

గురునానక్‌, బ‌స‌వ‌ణ్ణ‌, గాంధీ వంటి మ‌హాత్ములు ఎవ‌రూ కూడా త‌మ‌కు అంతా తెలుస‌ని అనుకోలేద‌ని రాహుల్ వ్యాఖ్యానించారు. అలా అనుకోవ‌డం ఓ పెద్ద రోగ‌మ‌ని అన్నారు. ప్ర‌స్తుతం భార‌త్‌లో కొంత మంది త‌మ‌కు అంతా తెలుస‌నే విష‌యాన్ని అంద‌రితోనూ బాగానే న‌మ్మించార‌ని.. వారిలో ప్ర‌ధాన మంత్రి మోదీ ఒక‌ర‌ని తెలిపారు. ‘ఒక వేళ మీరు మోదీని దేవుడి ద‌గ్గ‌ర కూర్చోబెట్టార‌నుకోండి.. ఆ భ‌గ‌వంతుడికే ఈ సృష్టి ఎలా పని చేస్తుందనే విషయాలను ఆయ‌న వివ‌రించేస్తారు.

ఇక ఆ త‌ర్వాత తానేమి సృజించానా అని ఆ దేవాదిదేవుడే అయోమ‌యంలో ప‌డిపోతాడ‌’ని రాహుల్ అనడంతోనే.. హాలంతా న‌వ్వులు విర‌బూశాయి. ఇది అంతా మీకు జోక్ గా అనిపించొచ్చు గానీ కొంత‌మంది.. సైంటిస్టుల‌కు సైన్స్‌ని, చ‌రిత్ర‌కారుల‌కి చ‌రిత్ర‌ని, సైన్యానికి యుద్ధాన్ని, వైమానిక ద‌ళానికి ఎగ‌ర‌డాన్ని నేర్పిస్తార‌ని మోదీని ఉద్దేశించి రాహుల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.