Aditya Om | అల్లు అర్జున్ ఫ్యాన్స్ హ్యాపీ.. ఇతర హీరోల ఫ్యాన్స్ ఫైర్.. ఇంతకీ ఈయన ఏమన్నాడంటే?
Aditya Om | హీరోగా హిట్లు పడితేనే ఏ ఇండస్ట్రీలో అయినా రాణించేది, నాలుగు కాలాలపాటు హీరోగా నిలబడేది. మరి పాపం ఆ హీరోకి ఓ బంపర్ హిట్ తర్వాత మరో హిట్ పడక వెనకబడిపోయాడు. దీంతో మొత్తం కెరియర్ తిరగబడిపోయింది. దర్శకుడిగా, నిర్మాతగా మారినా కూడా పెద్దగా కలిసిరాలేదు. అతగాడు ఈ మధ్యకాలంలో ఓ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్‌పై చేసిన కామెంట్స్‌తో మరోసారి వార్తలలో నిలుస్తున్నాడు. ఇంతకీ అతను ఎవరనుకుంటున్నారా? ఆదిత్య ఓం. విషయంలోకి వెళితే.. […]

Aditya Om |
హీరోగా హిట్లు పడితేనే ఏ ఇండస్ట్రీలో అయినా రాణించేది, నాలుగు కాలాలపాటు హీరోగా నిలబడేది. మరి పాపం ఆ హీరోకి ఓ బంపర్ హిట్ తర్వాత మరో హిట్ పడక వెనకబడిపోయాడు. దీంతో మొత్తం కెరియర్ తిరగబడిపోయింది. దర్శకుడిగా, నిర్మాతగా మారినా కూడా పెద్దగా కలిసిరాలేదు. అతగాడు ఈ మధ్యకాలంలో ఓ ఇంటర్వ్యూలో అల్లు అర్జున్‌పై చేసిన కామెంట్స్‌తో మరోసారి వార్తలలో నిలుస్తున్నాడు. ఇంతకీ అతను ఎవరనుకుంటున్నారా? ఆదిత్య ఓం.
విషయంలోకి వెళితే.. ‘లాహిరి లాహిరి లాహిరిలో’ మూవీ అప్పట్లో పెద్ద హిట్. హరికృష్ణ, భానుప్రియ, సుమన్, అంకిత, ఆదిత్య ఓం.. ఇలా భారీ తారాగణం నటించారు. అయితే కథలోని కొత్తదనం ఈ మూవీని హిట్‌గా నిలబెట్టింది. ఇందులో దర్శక దిగ్గజం కె. విశ్వనాధ్ కూడా ఉన్నారు. ఈ సినిమాతో మంచి హిట్ అందుకునన హీరో ఆదిత్య ఓం పరిస్థితి.. ఆ తర్వాత దారుణంగా మారింది. ఎన్ని సినిమాలు చేసినా సరైన హిట్ పడలేదు. ఏవేవో ప్రయత్నాలు చేసినా సక్సెస్ కాలేదు.
ఇక రీసెంట్‌గా హీరో అల్లు అర్జున్‌పై ఆదిత్య ఓం కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దేశంలోనే అల్లు అర్జున్ నెంబర్ వన్ అని, నార్త్ ఇండియాలో అల్లు అర్జున్‌కి ఉన్న క్రేజ్ మరో హీరోకి లేదని చెప్పుకొచ్చాడు. ఉత్తర ప్రదేశ్, బీహార్, నేపాల్ మాత్రమే కాకుండా పలు రాష్ట్రాల్లో కూడా అభిమానులను సంపాదించుకు న్నాడని, పుష్ప మూవీతో పాన్ ఇండియా స్టార్‌గా సత్తా చూపించాడని తెగ పొగిడేశాడు.
ఇంకా టాలీవుడ్‌లో ప్రభాస్, ఎన్టీఆర్‌కి మంచి ఫాలోయింగ్ ఉందని.. ఆర్‌ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్‌కి కూడా నార్త్‌లో ఫాలోయింగ్ పెరిగిందని చెప్పుకొచ్చాడు ఆదిత్య. అయితే ఆదిత్య చెప్పాలనుకున్నది అల్లు అర్జున్‌కి ఇతర రాష్ట్రాల్లో కూడా మంచి ఫాలోయింగ్‌తో దూసుకుపోతున్నాడని, అక్కడ కూడా తన హవా కొవసాగుతుందనేది అతని ఉద్దేశ్యం.
అల్లు అర్జున్ తెలుగు సినిమా ఏదైనా సరే మలయాళంలో డబ్ అయ్యి విడుదలవుతుంది. అక్కడ బన్నీకి మంచి మార్కెట్ ఉంది. అలాగే ఫ్యాన్స్‌కి కూడా కొదవలేదు. ఇదంతా బాగానే ఉంది కానీ.. ఆ నెంబర్ వన్ అనే పదమే.. ఇతర హీరోల ఫ్యాన్స్‌కి కోపాన్ని తెప్పిస్తోంది. అందుకే అతనిపై కారాలు మిరియాలు నూరుతున్నారు.
ఇక ఆయన చెబుతున్న అల్లు అర్జున్ విషయానికి వస్తే.. ‘పుష్ప’ మూవీ ఘనవిజయం సాధించి.. ఐదు భాషల్లో పాన్ ఇండియా మూవీగా రికార్డులను క్రియేట్ చేసింది. అలాగే కలెక్షన్స్ విషయంలోనూ కోట్లు కొల్లగొట్టింది. సినిమా విడుదలైనప్పుడు నెగిటివ్ టాక్ వచ్చినా.. నెమ్మదిగా ఊపందుకుని భారీగా కలెక్షన్స్‌ని రాబట్టింది. దీనికి సీక్వెల్ ‘పుష్ప 2’ ప్రస్తుతం సెట్స్‌పై ఉంది. ఈ సీక్వెల్‌ను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.