భారీ ఆఫర్లతో రిపబ్లిక్‌ డే సేల్‌కు రెడీ అయిన అమెజాన్‌..! సేల్స్‌ ఎప్పుడంటే..?

ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ మరోసారి ఆఫర్లతో ముందుకువస్తున్నది. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా అమెజాన్‌ గ్రేట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌-2024కు సిద్ధమైంది

భారీ ఆఫర్లతో రిపబ్లిక్‌ డే సేల్‌కు రెడీ అయిన అమెజాన్‌..! సేల్స్‌ ఎప్పుడంటే..?

Amazon Republic Day Sale | ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ మరోసారి ఆఫర్లతో ముందుకువస్తున్నది. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా అమెజాన్‌ గ్రేట్‌ రిపబ్లిక్‌ డే సేల్‌-2024కు సిద్ధమైంది. ఈ మేరకు వెబ్‌సైట్‌లో విషయాన్ని వెల్లడించింది. ప్రతి సంవత్సరం అమెజాన్‌ గణతంత్ర దినోత్సవానికి ముందు రిపబ్లిక్‌ డే సేల్‌ను ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌తో సహా పలు ఉత్పత్తులపై ఆకర్షణీయమైన డిస్కౌంట్‌లను అందిస్తున్నది. అలాగే సేల్‌లో భాగంగా వినియోగదారులకు బ్యాంక్ కార్డు లావాదేవీలపై ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ను సైతం ఆఫర్‌ చేస్తున్నది.


అమెజాన్‌ గ్రేట్‌ రిపబ్లిక్‌ డే సందర్భంగా ప్రత్యేకంగా పేజీని పబ్లిష్‌ చేసినా.. ఎప్పటి నుంచి మొదలవుతాయో మాత్రం వెల్లడించలేదు. గత ఏడాదిలో సేల్ జనవరి 15న రిపబ్లిక్‌ డే సేల్‌ ప్రారంభమైంది. ఈ ఏడాది సైతం అదే తేదీన ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది. ఇతర సేల్ ఈవెంట్‌ల మాదిరిగానే, అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రైబర్‌లు రాబోయే సేల్‌కు ముందస్తు యాక్సెస్‌ ఉంటుందని అమెజాన్‌ ప్రకటించింది. రాబోయే సేల్‌లో అమెజాన్ స్మార్ట్‌ఫోన్‌లు, అప్లియన్సెస్‌పై 40 శాతం వరకు తగ్గింపు ఇవ్వబోతున్నది.


5జీ స్మార్ట్‌ఫోన్‌లు రూ.9,999కే అందుబాటులో ఉండనుండగా.. కొన్ని స్మార్ట్‌ఫోన్లపై రూ.50వేల వరకు తగ్గింపు ఉండే అవకాశం ఉన్నది. ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు 75శాతం వరకు డిస్కౌంట్‌ రానున్నది. స్మార్ట్‌టీవీలు, ఇతర అప్లియన్సెస్ 65 శాతం తగ్గింపు ఇవ్వనున్నది. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు, ఈఎంఐ లావాదేవీలపై 10శాతం ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ సైతం వర్తించనున్నది. త్వరలోనే రిపబ్లిక్‌ డే సేల్‌ మొదలయ్యేది ఎన్నడో అమెజాన్‌ రెండుమూడురోజుల్లోనే ప్రకటించే అవకాశం ఉన్నది.