Malli Pelli Movie | అమెజాన్ ప్రైమ్ నుంచి ‘మళ్లీ పెళ్లి’ అవుట్..! కారణం అదేనా..?
Malli Pelli Movie | టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్, పవ్రితా లోకేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మళ్లీ పెళ్లి. ఈ చిత్రం స్ట్రీమింగ్‌ను అమెజాన్ ప్రైమ్ నిలిపివేసింది. గత నెల 23న ఆహా ఓటీటీతో పాటు అమెజాన్ ప్రైమ్‌లో ‘మళ్లీ పెళ్లి’ విడుదలైన విషయం విధితమే. ప్రస్తుతం ఈ సినిమా ఆహా ఓటీటీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతున్నది. అమెజాన్ ప్రైమ్ ఈ చిత్రాన్ని ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించింది. లీగల్ ప్రాబ్లమ్స్ కారణంగా స్ట్రీమింగ్‌ను నిలిపివేసినట్లు […]

Malli Pelli Movie | టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్, పవ్రితా లోకేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మళ్లీ పెళ్లి. ఈ చిత్రం స్ట్రీమింగ్‌ను అమెజాన్ ప్రైమ్ నిలిపివేసింది. గత నెల 23న ఆహా ఓటీటీతో పాటు అమెజాన్ ప్రైమ్‌లో ‘మళ్లీ పెళ్లి’ విడుదలైన విషయం విధితమే. ప్రస్తుతం ఈ సినిమా ఆహా ఓటీటీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతున్నది. అమెజాన్ ప్రైమ్ ఈ చిత్రాన్ని ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించింది. లీగల్ ప్రాబ్లమ్స్ కారణంగా స్ట్రీమింగ్‌ను నిలిపివేసినట్లు తెలుస్తున్నది. అయితే, తన వ్యక్తిగత ప్రతిష్ఠకు భంగం కలిగేలా ‘మళ్లీ పెళ్లి’ సినిమా ఉందని, ఓటీటీ స్ట్రీమింగ్‌ను నిలిపివేయాలంటూ నరేశ్ మూడో భార్య రమ్య రఘుపతి ఇటీవల కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే సినిమాను అమెజాన్ ప్రైమ్ తొలగించనట్లు సమాచారం. తెలుగుతో పాటు కన్నడ స్ట్రీమింగ్‌ను సైతం నిలిపివేసినట్లు తెలుస్తున్నది.
టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్, పవిత్రా లోకేశ్ జీవితంలో యథార్థంగా జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకొని దర్శకుడు ఎంఎస్ రాజు ‘మళ్లీ పెళ్లి’ని తెరకెక్కించారు. టీజర్స్, ట్రైలర్స్‌తో ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా థియేటర్లలో మాత్రం అభిమానులను అలరించలేకపోయింది. నరేశ్, పవిత్రా లోకేశ్ కోణాల నుంచి మాత్రమే జరిగిన వాస్తవాల్ని చూపించారు. దాదాపు చిత్రం కథ అందరికీ తెలిసిందే కావడంతో మూవీ థియేటర్లలో ఆకట్టుకోలేకపోయింది. విజయకృష్ణా బ్యానర్‌పై నరేశ్ స్వయంగా ‘మళ్లీ పెళ్లి’ చిత్రాన్ని నిర్మించగా.. విజయ్‌కుమార్, శరత్‌బాబు, జయసుధ తదితర సీనియర్ నటులు కీలకపాత్రల్లో నటించారు.