ఆసుపత్రిలో చేరిన అమితాబ్ బచ్చన్ కారణం అదేనట!
బాలీవుడ్ బిగ్‌బీ అమితాబచ్చన్ ఆసుపత్రిలో చేరారు. శుక్రవారం తెల్లవారుజామున అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేర్చారు

విధాత, ముంబై: బాలీవుడ్ బిగ్‌బీ అమితాబచ్చన్ ఆసుపత్రిలో చేరారు. శుక్రవారం తెల్లవారుజామున అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చేర్చారు. దీంతో వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు వయస్సు పైపడటం తప్ప మరే సమస్యలు లేవని వెల్లడించారు. అమితాబ్ ఆరోగ్యం కుదుటగానే ఉన్నదని అభిమానులు ఆందోళన చెందాల్సిన పని లేదని బచ్చన్ ఫ్యామిలి తెలిపింది.
ప్రస్తుతం అమితాబ్ వయస్సు 81 ఏళ్లు. గతంలో పలుమార్లు జనరల్ చెకప్ కోసం ఆసుపత్రికి వెళ్లారు. ఇటీవలే జరిగిన ముఖేష్ అంబానీ కుమారుడు ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్‌కు హాజరయ్యారు. పార్టీకి హాజరైనప్పుడు కూడా పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. ఇంతలోనే అస్వస్థతకు గురికావడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తమ అభిమాన నటుడు త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు చేస్తున్నారు.