Schools | స్కూల్లో విద్యార్థులు నిద్రించాలంటే.. ఈ ఫీజులు చెల్లించాల్సిందే..!

Schools | విద్యార్థులు త‌ర‌గ‌తి గ‌దుల్లో నిద్రిస్తే టీచ‌ర్లు మంద‌లిస్తారు. నిద్ర‌లోకి జారుకునే పిల్ల‌ల‌ను పైకి లేపి ప‌నిష్మెంట్ ఇస్తారు. అవ‌స‌ర‌మైతే నిద్ర మ‌బ్బు వ‌దిలించేందుకు రెండు వాయిస్తారు. కానీ ఈ స్కూల్లో మాత్రం విద్యార్థులు నిద్రించేందుకు అనుమ‌తి ఇచ్చారు. అందుకు కొంత ఫీజు కూడా వ‌సూళ్లు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. మ‌రి ఆ స్కూల్ గురించి వెళ్లాలంటే చైనా వెళ్ల‌క త‌ప్ప‌దు. చైనాలోని గౌంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని జైషెంగ్ ప్రైమ‌రీ స్కూల్ యాజ‌మాన్యం ఓ నోటీసు జారీ చేసింది. […]

  • By: raj    latest    Sep 12, 2023 1:50 PM IST
Schools | స్కూల్లో విద్యార్థులు నిద్రించాలంటే.. ఈ ఫీజులు చెల్లించాల్సిందే..!

Schools |

విద్యార్థులు త‌ర‌గ‌తి గ‌దుల్లో నిద్రిస్తే టీచ‌ర్లు మంద‌లిస్తారు. నిద్ర‌లోకి జారుకునే పిల్ల‌ల‌ను పైకి లేపి ప‌నిష్మెంట్ ఇస్తారు. అవ‌స‌ర‌మైతే నిద్ర మ‌బ్బు వ‌దిలించేందుకు రెండు వాయిస్తారు. కానీ ఈ స్కూల్లో మాత్రం విద్యార్థులు నిద్రించేందుకు అనుమ‌తి ఇచ్చారు. అందుకు కొంత ఫీజు కూడా వ‌సూళ్లు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. మ‌రి ఆ స్కూల్ గురించి వెళ్లాలంటే చైనా వెళ్ల‌క త‌ప్ప‌దు.

చైనాలోని గౌంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని జైషెంగ్ ప్రైమ‌రీ స్కూల్ యాజ‌మాన్యం ఓ నోటీసు జారీ చేసింది. త‌మ స్కూల్లో విద్యార్థులు నిద్రించేందుకు అనుమ‌తిస్తున్నామ‌ని, అందుకు ప్ర‌త్యేక ఫీజులు వ‌సూళ్లు చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు. మ‌ధ్యాహ్నం లంచ్ త‌ర్వాత విద్యార్థుల‌కు ఈ వెసులుబాటు క‌ల్పిస్తున్న‌ట్లు తెలిపారు.

ఇక ఈ ప్రోగ్రామ్‌కు మూడు ర‌కాల ఫీజులు నిర్ణ‌యించారు. విద్యార్థులు త‌మ కుర్చీ వ‌ద్దే త‌ల వాల్చి నిద్రించాల‌నుకుంటే రూ. 2,300 చెల్లించాలి. త‌ర‌గతి గ‌దుల్లోనే మ్యాట్‌పై నిద్రించాలంటే రూ. 4,500, ప్ర‌త్యేక గ‌దుల్లో మ్యాట‌ర‌స్‌పై నిద్రించాలంటే రూ. 7,800 చెల్లించాల్సి ఉంటుంద‌ని నోటీసుల్లో పేర్కొన్నారు. ప్ర‌స్తుతం ఈ స్క్రీన్ షాట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ఈ స్కూల్ వ్య‌వ‌హారంపై నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. స్కూల్లో నిద్రించ‌డానికి అనుమ‌తులు ఏంటి..? ఫీజులు వ‌సూలు చేయ‌డం ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ప్రైవేటు స్కూల్స్ అందిన‌కాడికి దోచుకుంటున్నాయ‌ని మండిప‌డుతున్నారు. భ‌విష్య‌త్‌లో వాష్‌రూమ్‌కు వెళ్లాలంటే కూడా డ‌బ్బులు వ‌సూళ్లు చేస్తారేమో అని నెటిజన్లు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.