Anand Mahindra | ఈ బెడ్ రూంలో గ‌డ‌పాలంటే గ‌ట్స్ కావాలి!

Anand Mahindra విధాత‌: ప్ర‌కృతిలో వింత‌లు, విడ్డూరాలు, అద్భుతాలు, ఆశ్చర్యాలకు కొద‌వ ఉండ‌దు. కానీ, వాటిని ఆస్వాదించాలంటే మాత్రం క‌చ్చితంగా గ‌ట్స్ ఉండాలి. ఎంతో ధైర్యం కావాలి. ప్రకృతి ఒడిలో సేద‌తీరాల‌నే, ప్ర‌కృతిని ఆస్వాదించుకొనే ఔత్సాహికులు కూడా ఇక్క‌డ క‌నిపిస్తున్న‌ బెడ్ రూమ్‌లో గ‌డ‌పాలంటే కొండంత గుండె ధైర్యం కావాల్సిందే. ఎందుకంటే అలా ఉంటుంది ఆ బెడ్ రూమ్‌. సోష‌ల్‌మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ప్ర‌ముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌మ‌హీంద్రా.. అంద‌మైన, ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన‌, ఆద‌ర్శ‌వంత‌మైన అంశాల‌ను, ఫొటోల‌ను సోష‌ల్ […]

Anand Mahindra | ఈ బెడ్ రూంలో గ‌డ‌పాలంటే గ‌ట్స్ కావాలి!

Anand Mahindra

విధాత‌: ప్ర‌కృతిలో వింత‌లు, విడ్డూరాలు, అద్భుతాలు, ఆశ్చర్యాలకు కొద‌వ ఉండ‌దు. కానీ, వాటిని ఆస్వాదించాలంటే మాత్రం క‌చ్చితంగా గ‌ట్స్ ఉండాలి. ఎంతో ధైర్యం కావాలి. ప్రకృతి ఒడిలో సేద‌తీరాల‌నే, ప్ర‌కృతిని ఆస్వాదించుకొనే ఔత్సాహికులు కూడా ఇక్క‌డ క‌నిపిస్తున్న‌ బెడ్ రూమ్‌లో గ‌డ‌పాలంటే కొండంత గుండె ధైర్యం కావాల్సిందే. ఎందుకంటే అలా ఉంటుంది ఆ బెడ్ రూమ్‌.

సోష‌ల్‌మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ప్ర‌ముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌మ‌హీంద్రా.. అంద‌మైన, ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన‌, ఆద‌ర్శ‌వంత‌మైన అంశాల‌ను, ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్‌చేస్తూ ఉంటారు. త‌న అభిప్రాయాల‌ను నెటిజ‌న్ల‌తో పంచుకుంటారు. ఆయ‌న ఈ నెల 12న‌ అందమైన డిజైన్‌తో ఉన్న ఒక‌ బెడ్ రూమ్ ఫొటోను ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు.

‘సాధారణంగా, నేను ఈ అందమైన డిజైన్‌ను చూసి ఆశ్చర్యపోతుంటాను. కానీ, ప్ర‌పంచ‌వ్యాప్తంగా వ‌ర్షాలు బీభ‌త్సం సృష్టిస్తుండ‌టం, కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డుతుండ‌టం వంటి అంశాలు భ‌యాందోల‌న‌కు గురిచేస్తున్నాయి. వర్షాల ప్రభావం దురదృష్టకర సంఘటనలకు దారితీయవచ్చు. ఈ స‌మ‌యంలో ఇలాంటి బెడ్ రూమ్‌లో ఒక రాత్రి గ‌డ‌ప‌డానికి నేను అంగీక‌రించ‌లేక‌పోవ‌చ్చు’ అని పేర్కొన్నారు.

ఇంత‌కీ ఆ బెడ్ రూమ్ ఎలా ఉంద‌టే..

కొండ అంచున‌ చుట్టూ అద్దాల‌తో, క‌ల‌ప‌తో లోయ‌లో ముందుకు దూసుకొచ్చిన‌ డిజైన్‌లో నిర్మించారు. మూడు వైపులా లోయ అందాలు క‌నిపిస్తాయి. ఉత్కంఠభరితంగా బెడ్‌రూమ్ ఉంటుంది. వాన చినుకులు, హోరుగాలి అద్దాల‌ను తాకిన‌ప్పుడు క‌లిగే అనుభూతి మాట‌ల్లో వ‌ర్ణించలేము అన్న‌ట్టుగా ఉన్న‌ది. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విట్ట‌ర్‌లో ఫోస్టు చేయ‌గా, వైర‌ల్‌గా మారింది