Andhra Pradesh | విలేకరులు వ్యభిచార గృహాల్లోని బ్రోకర్లు: ఏపీ ప్రభుత్వ విప్ రామచంద్రారెడ్డి

Andhra Pradesh విధాత‌: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విలేకరులను ఉద్దేశించి ఎమ్మెల్యే, ఏపీ ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విలేఖరులను వ్యభిచార గృహాల్లోని బ్రోకర్లతో పోల్చారు. ముఖ్యంగా, కొన్ని చానళ్ళలో పని చేసే విలేఖరులు వ్యభిచార గృహాల్లో పని చేసే బ్రోకర్ల కంటే హీనంగా ఉన్నారని ఆరోపించారు. అలాంటి వారంతా ఆ వృత్తి నుంచి బయటకు వచ్చి కొబ్బరి బోండాలు అమ్ముకుంటే మంచిదని హితవు పలికారు. అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే అయిన ఆయన.. […]

  • Publish Date - June 27, 2023 / 01:55 PM IST

Andhra Pradesh

విధాత‌: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విలేకరులను ఉద్దేశించి ఎమ్మెల్యే, ఏపీ ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. విలేఖరులను వ్యభిచార గృహాల్లోని బ్రోకర్లతో పోల్చారు. ముఖ్యంగా, కొన్ని చానళ్ళలో పని చేసే విలేఖరులు వ్యభిచార గృహాల్లో పని చేసే బ్రోకర్ల కంటే హీనంగా ఉన్నారని ఆరోపించారు.

అలాంటి వారంతా ఆ వృత్తి నుంచి బయటకు వచ్చి కొబ్బరి బోండాలు అమ్ముకుంటే మంచిదని హితవు పలికారు. అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే అయిన ఆయన.. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ విప్‌గానూ వ్యవహరిస్తున్నారు. రాయదుర్గంలో మాట్లాడుతూ విలేకరులపై మండిపడ్డారు.

నియోజకవర్గంలోని బొమ్మనహాల్ మండలం గౌనూరు గ్రామంలో ఆయన గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ సమయంలో కొన్ని మీడియా చానళ్లు, పత్రికలు వ్యవహరించిన తీరును ఆయన తీవ్రంగా తప్పుబడుతూ మీడియాపై పరుష పదజాలంతో రెచ్చిపోయారు.

గ్రామస్థులు పత్తిపొలాల్లో పనులకు వెళ్లారని, వారొచ్చిన తర్వాత కలిసి ఫోటోలు తీయించుకుంటున్నామంటూ ఇష్టమొచ్చినట్టు వార్తలు రాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తమకు బ్రహ్మరథం పడుతుంటే దీన్ని జీర్ణించుకోలోని కొందరు విలేకరులు ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తున్నారంటూ విలేఖరులను బూతులు తిట్టారు.