తెలంగాణ ఇంచార్జ్ డీజీపీగా అంజనీ కుమార్
విధాత: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరుగురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. తెలంగాణ ఇంఛార్జ్ డీజీపీగా అంజనీకుమార్ నియామకం అయ్యారు. ప్రస్తుత డీజీపీ మహేందర్ రెడ్డి ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇంచార్జీగా డీజీపీగా అంజనీ కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అంజనీ కుమార్ ఏసీబీ డీజీగా కొనసాగుతున్నారు. ఇక రాచకొండ పోలీసు కమిషనర్‌గా డీఎస్ చౌహాన్‌ను నియమించారు. రాచకొండ సీపీగా కొనసాగుతున్న మహేశ్ భగవత్‌ను సీఐడీ […]

విధాత: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరుగురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. తెలంగాణ ఇంఛార్జ్ డీజీపీగా అంజనీకుమార్ నియామకం అయ్యారు. ప్రస్తుత డీజీపీ మహేందర్ రెడ్డి ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇంచార్జీగా డీజీపీగా అంజనీ కుమార్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం అంజనీ కుమార్ ఏసీబీ డీజీగా కొనసాగుతున్నారు.
ఇక రాచకొండ పోలీసు కమిషనర్‌గా డీఎస్ చౌహాన్‌ను నియమించారు. రాచకొండ సీపీగా కొనసాగుతున్న మహేశ్ భగవత్‌ను సీఐడీ అడిషనల్ డీజీగా నియామకం అయ్యారు. ఏసీబీ డీజీగా రవి గుప్తాకు అదనపు బాధ్యతలు అప్పగించారు. తెలంగాణ అగ్నిమాపక శాఖ డీజీగా జితేందర్, లా అండ్ ఆర్డర్ డీజీగా సంజయ్ కుమార్ జైన్ నియామకం అయ్యారు.