మహా శివుడికి చేసే అభిషేకాలు.. కలిగే ఫలితాలివే!
విధాత: 'అభిషేక ప్రియం శివః' అంటే శివుడు అభిషేక ప్రియుడు అని అర్థం. అభిషేక సమయంలో దైవ విగ్రహాల నుంచి మహాద్భతమైన శక్తులు ఉత్పన్నమవుతాయి. నీటితో అభిషేకమంటే శివునకు చాలా ఇష్టం. నీరు సాక్షాత్తు విష్ణు స్వరూపం. అందుకే శివునకు నీరు అంటే చాలా ఇష్టం. శివునికి జలాభిషేకం చేస్తున్నప్పుడు ఆ నీటి స్పర్శతో నారాయణ స్పర్శానుభూతితో పులకిస్తాడు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుర్ విష్ణోశ్చ హృదయం శివః శివుడికి ఎన్నో రకాల […]

విధాత: ‘అభిషేక ప్రియం శివః’ అంటే శివుడు అభిషేక ప్రియుడు అని అర్థం. అభిషేక సమయంలో దైవ విగ్రహాల నుంచి మహాద్భతమైన శక్తులు ఉత్పన్నమవుతాయి. నీటితో అభిషేకమంటే శివునకు చాలా ఇష్టం. నీరు సాక్షాత్తు విష్ణు స్వరూపం. అందుకే శివునకు నీరు అంటే చాలా ఇష్టం. శివునికి జలాభిషేకం చేస్తున్నప్పుడు ఆ నీటి స్పర్శతో నారాయణ స్పర్శానుభూతితో పులకిస్తాడు.
శివాయ విష్ణురూపాయ
శివరూపాయ విష్ణవే
శివస్య హృదయం విష్ణుర్
విష్ణోశ్చ హృదయం శివః
శివుడికి ఎన్నో రకాల పదార్థాలు, ద్రవ్యాలతో అభిషేకాలు చేస్తారు. దేనితో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం లభిస్తుందో తెలుసుకుందాం…
- గరిక నీటితో శివుడికి అభిషేకం చేస్తే నష్టమైన రుణం తిరిగి పొందుతారు.
- నువ్వుల నూనెతో అభిషేకిస్తే అపమృత్యువు తొలగును.
- ఆవు పాలతో చేస్తే సర్వ సుఖాలు ప్రాప్తిస్తాయి.
- పెరుగుతో చేస్తే బలము, ఆరోగ్యం, యశస్సు లభిస్తాయి.
- ఆవు నెయ్యితో చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగును.
- చెరుకు రసంతో ధన వృద్ధి జరుగును.
- మెత్తటి చక్కెరతో చేస్తే దుఃఖం నాశనమగును.
- మారేడు బిల్వ దళాలు, జలంతో చేస్తే భోగభాగ్యాలు సమకూరును.
- తేనేతో చేస్తే తేజో వృద్ది కలుగును.
- పుష్పోదకముతో అభిషేకిస్తే భూలాభము కలుగును.
- కొబ్బరి నీటితో సకల సంపదలు సమకూరుతాయి.
- రుద్రాక్షజలాభిషేకము చేస్తే సకల ఐశ్వర్యములు ప్రాప్తించును.
- భస్మాభిషేకంతో మహాపాపాలు నశించును.
- గంథోదకముతో చేస్తే సత్పుత్ర ప్రాప్తం కలుగును.
- బంగారపు నీటితో చేస్తే ఘోర దారిద్రము పటాపంచలగును.
- నీటితో చేస్తే నష్టమైనవి తిరిగి లభించును
- అన్నముతో అభిషేకిస్తే అధికార ప్రాప్తి, మోక్షము, దీర్ఘాయువు ప్రాప్తించును
- ద్రాక్షరసంతో అభిషేకం చేస్తే ప్రతి పనిలో విజయం కలుగును.
- ఖర్జూర రసంతో శత్రుహానీ తొలగిపోతుంది.
- నేరేడు పండ్ల రసంతో వైరాగ్యం లభించును
- నవరత్నోదకముతో అభిషేకించినా ధాన్యం, గృహ, గోవృద్ధి కలుగును.
- మామిడి పండ్ల రసంతో చేస్తే దీర్ఘ వ్యాధులు నిర్మూలమగును.
- పసుపు నీటితో చేస్తే మంగళకరము, శుభకార్యములు జరుగును.