వరంగల్‌లో మరో సీఐ సస్పెన్షన్.. కొరడా ఝలిపిస్తున్న సీపీ రంగనాథ్
విధాత, వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మరో సీఐని సోమవారం సిపి ఏవి రంగనాథ్ సస్పెండ్ చేశారు ఇప్పటికే నలుగురు పోలీసు అధికారులపై వేటుపడగా ఈ సంఖ్య ఐదుకు చేరింది. కమిషనరేట్ పరిధిలో పనిచేసే టాస్క్ ఫోర్స్ విభాగానికి చెందిన ఇన్స్పెక్టర్ వి.నరేష్ కుమార్ తో పాటు ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు పి శ్యాంసుందర్, కె సోమలింగం, ఒక కానిస్టేబుల్ బి సృజన్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ ఉత్తర్వులు […]

విధాత, వరంగల్: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మరో సీఐని సోమవారం సిపి ఏవి రంగనాథ్ సస్పెండ్ చేశారు ఇప్పటికే నలుగురు పోలీసు అధికారులపై వేటుపడగా ఈ సంఖ్య ఐదుకు చేరింది.
కమిషనరేట్ పరిధిలో పనిచేసే టాస్క్ ఫోర్స్ విభాగానికి చెందిన ఇన్స్పెక్టర్ వి.నరేష్ కుమార్ తో పాటు ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు పి శ్యాంసుందర్, కె సోమలింగం, ఒక కానిస్టేబుల్ బి సృజన్ ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు.
పిడిఎస్ రైస్ అక్రమ రవాణాకు సంబంధించి నిందితుల పై ఎలాంటి కేసులు నమోదు చేయకుండా వారి నుండి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు కారణంగా పేర్కొన్నారు. దీంతో పాటు ఇతర విషయాల్లో కూడా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లుగా వచ్చిన ఆరోపణలు నిర్ధారణ కావడంతో వీరిని సస్పెండ్ చేస్తూ కమిషనర్ ఏవి రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు.