America: అమెరికాలో మరో తెలుగు యువకుడిపై కాల్పులు!
అమెరికాలో (America) గన్‌కల్చర్ పెరిగిపోతోంది. ముఖ్యంగా ఇండియా నుంచి వెళ్లిన ఎంతో మంది యువతీ యువకులు అక్కడి దుండగుల ఆకృత్యాలకు బలవుతున్నారు. తాజాగా టేనస్సీ లో ఉంటున్న సాయి అనే యువకుడిపై దుండగులు కాల్పులకు పాల్పడ్డారు.

America: అమెరికాలో మరో తెలుగు యువకుడిపై కాల్పుల ఘటన కలకలం రేపింది. టేనస్సీ లో ఉంటున్న సాయి అనే యువకుడిపై దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. కార్ పార్కింగ్ చేస్తున్న సమయంలో సాయిపై దుండగులు రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. కాల్పుల్లో సాయికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం సాయికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుంది
. అమెరికాలో (America) గన్‌కల్చర్ పెరిగిపోతోంది. ముఖ్యంగా ఇండియా నుంచి వెళ్లిన ఎంతో మంది యువతీ యువకులు అక్కడి దుండగుల ఆకృత్యాలకు బలవుతున్నారు. నెల క్రితం హైదరాబాద్‌కు చెందిన రవితేజ అనే యువకుడు కూడా దుండగుల తూటాలకు బలయ్యాడు. ఉన్నత విద్య కోసం, ఉజ్వల భవిష్యత్ కోసం స్వదేశాన్ని వీడి అమెరికాకు వెళ్తున్న యువకులు దుండగుల ఆకస్మిక దాడుల బారిన పడి తమ కుటుంబాలకు తీరని కడుపుకోత మిగిలిస్తున్నారు.
అక్కడే చదువుకోవడమే కాకుండా.. ఉద్యోగాలు సంపాదించి స్థిరపడిపోవాలన్న ఆశలు కాల్పుల ఘటనలతో అర్థాంతరంగా కల్లలైపోతున్నాయి. అమెరికాలో పెరిగిపోతున్న గన్‌కల్చర్‌కు ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.