మరో విద్యార్థి ఆత్మహత్యా యత్నం
హైదరాబాద్ అనురాగ్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి జ్ఞానేశ్వర్ బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు

విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ అనురాగ్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి జ్ఞానేశ్వర్ బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. విద్యార్థి జ్ఞానేశ్వర్ యూనివర్సిటీ భవనం సెకండ్ ఫ్లోర్ నుంచి దూకడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. వెంటనే తోటి విద్యార్థులు స్పందించి చికిత్స నిమిత్తం అతణ్ని దగ్గరలో ఉన్న నీలిమ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో విద్యార్థుల వరుస ఆత్మహత్యల కలకలం రేపుతున్నాయి. ఇటీవల గీతం యూనివర్సిటీ భవనంపై నుంచి దూకి బీటెక్ స్టూడెంట్ రేణుశ్రీ ఆత్మహత్య, అదే రోజు నల్ల మల్లారెడ్డి కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విజయ్ ఘట్‌కేసర్ రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హన్మకొండ ఎస్‌ఆర్ యూనివర్సిటీలో ఉరి వేసుకుని రాథోడ్ దీప్తి అత్మహత్యకు పాల్పడింది.