AP | గుండెపోటుకు అత్యవసర సాయం..! ఉచితంగా రూ.40 వేల ఇంజక్షన్‌

AP | ప్రత్యేక మందు అందుబాటులోకి వైయస్ జగన్ ప్రత్యేక ఏర్పాట్లు!! విధాత‌: ఇటీవల కాలంలో యువకులు.. ముప్ఫై, నలభై ఏళ్ళలోపు వాళ్ళు సైతం కొన్ని చోట్ల స్కూల్, కాలేజీ పిల్లలు సైతం సడన్ గుండెపోటుకు గురై ప్రాణాలు వదులుతున్న సంఘటనలు ఎక్కువగా అవుతున్నాయి. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్, ఏపీ పరిశ్రమల మంత్రి గౌతం రెడ్డి తదితరులు ఇలా ఫుల్ ఫిట్‌గా ఉంటూనే హఠాత్తుగా గుండెపోటుకు గురై ప్రాణాలు వదిలేశారు. అయితే గుండెపోటుకు […]

  • By: Somu    latest    Aug 17, 2023 12:53 PM IST
AP | గుండెపోటుకు అత్యవసర సాయం..! ఉచితంగా రూ.40 వేల ఇంజక్షన్‌

AP |

  • ప్రత్యేక మందు అందుబాటులోకి
  • వైయస్ జగన్ ప్రత్యేక ఏర్పాట్లు!!

విధాత‌: ఇటీవల కాలంలో యువకులు.. ముప్ఫై, నలభై ఏళ్ళలోపు వాళ్ళు సైతం కొన్ని చోట్ల స్కూల్, కాలేజీ పిల్లలు సైతం సడన్ గుండెపోటుకు గురై ప్రాణాలు వదులుతున్న సంఘటనలు ఎక్కువగా అవుతున్నాయి. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్, ఏపీ పరిశ్రమల మంత్రి గౌతం రెడ్డి తదితరులు ఇలా ఫుల్ ఫిట్‌గా ఉంటూనే హఠాత్తుగా గుండెపోటుకు గురై ప్రాణాలు వదిలేశారు.

అయితే గుండెపోటుకు గురవ్వగనే తక్షణమే మందు అందుబాటులో ఉంటే ప్రాణాలు కాపాడావచ్చని డాక్టర్లు చెబుతున్నారు. ఈ క్రమంలో జగన్ ప్రత్యేక చర్యలు తీసుకుని ప్రజలను గుండెపోటు మరణాల నుంచి కాపాడే యత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో 38 లక్షల మందికి పైగా గుండె జబ్బుల బాధితులున్నారు.

కార్డియాలజీ, కార్డియోవాస్క్యులర్‌ సేవలను మరింత విస్తృతం చేయాలని జగన్ ఆదేశించారు. గుండె జబ్బులతో బాధపడే గ్రామీ­ణుల­కు వెంటనే వైద్య సేవలందించి, వారిని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడేందుకు ‘స్టెమీ’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించారు.

ఈ కార్యక్రమం ద్వారా గుండెపోటుకు గురైనవారికి గోల్డెన్‌ అవర్‌లో అంటే 40 నిమిషాల్లోనే చికిత్స అందజేస్తారు. అవసరమైతే రూ.40 వేలు విలువ చేసే థ్రాంబోలైసిస్‌ ఇంజక్షన్‌ ఉచితంగా బాధితులకు ఇస్తారు. ఇదంతా 40 నిమిషాల్లోనే జరుగుతుంది. దీంతో రోగి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడతారు.

స్టెమీని ఇప్పటికే తిరుపతి రుయా ఆస్పత్రిలో పైలెట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. రెండో దశ ప్రాజెక్టును సెప్టెంబర్‌ 29 నుంచి కర్నూలు, గుంటూరు, విశాఖపట్నంల్లో అమలు చేస్తారు.

వచ్చే ఏడాది జనవరి నుంచి స్టెమీని రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తారు. ఈలోపు 11 పాత బోధనాస్పత్రుల్లో కార్డియాలజీ, కార్డియో వాస్క్యులర్‌ (సీటీవీఎస్‌) విభాగాలను బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఇది పేదలకు అత్యంత విలువైన సేవగా భావిస్తున్నారు.