AP | TDPకి షాక్‌.. అమరావతి అక్రమాలపై దర్యాప్తునకు సుప్రీం ఒకే

AP విధాత‌: చంద్రబాబుకు ఓ షాక్ తగిలింది.. అమరావతి భూ కుంభకోణం మీద విచారణకు అడ్డంకులు తొలిగిపోయాయి. అక్కడ భూ కుంభకోణాన్ని వెలికితీసేందుకు రాష్ట్రప్రభుత్వం వేసిన సిట్ ను దర్యాప్తు చేయకుండా ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీం కోర్టు కొట్టేసింది. సిట్ దర్యాప్తు కొనసాగించవచ్చని ఉత్తర్వులు ఇచ్చింది. ఎన్నికలు సమీపిస్తున్నవేళ ఇది జగన్ కు దొరికిన అస్త్రం అనుకోవాలి. అమరావతిలో రాజధాని ఏర్పాటుకు ముందే TDP వాళ్ళు చవగ్గా భూములు కొనేసి.. ఎస్సీ ఎస్టీలకు చెందిన […]

  • By: Somu    latest    May 03, 2023 10:35 AM IST
AP | TDPకి షాక్‌.. అమరావతి అక్రమాలపై దర్యాప్తునకు సుప్రీం ఒకే

AP

విధాత‌: చంద్రబాబుకు ఓ షాక్ తగిలింది.. అమరావతి భూ కుంభకోణం మీద విచారణకు అడ్డంకులు తొలిగిపోయాయి. అక్కడ భూ కుంభకోణాన్ని వెలికితీసేందుకు రాష్ట్రప్రభుత్వం వేసిన సిట్ ను దర్యాప్తు చేయకుండా ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేను సుప్రీం కోర్టు కొట్టేసింది. సిట్ దర్యాప్తు కొనసాగించవచ్చని ఉత్తర్వులు ఇచ్చింది.

ఎన్నికలు సమీపిస్తున్నవేళ ఇది జగన్ కు దొరికిన అస్త్రం అనుకోవాలి. అమరావతిలో రాజధాని ఏర్పాటుకు ముందే TDP వాళ్ళు చవగ్గా భూములు కొనేసి.. ఎస్సీ ఎస్టీలకు చెందిన ఎసైన్డ్ భూములను సైతం కొట్టేసి తరువాత భారీగా లబ్ది పొందాలని చూస్తున్నారని జగన్ ప్రభుత్వం భావిస్తూ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని వేసింది.

అది ఇప్పటికే మాజీ మంత్రి నారాయణ, అశ్వనీదత్, మరికొందరు టిడిపి నాయకులు అక్కడ భూములు కొన్న విషయాన్నీ వెలికితీసింది. అంతేకాకుండా న్యాయమూర్తులకు సైతం ఇక్కడ ఇళ్ల స్థలాలు కేటాయించిన విషయాన్నీ జగన్ ప్రభుత్వం వెలికితీసి బహిర్గత పరిచింది. అయితే దీనిమీద చంద్రబాబు తదితరులు హైకోర్టులో కేసు వేశారు. దర్యాప్తును ఆపాలని కోరారు.

దీంతో దానిమీద ఆంధ్ర హైకోర్టు స్టే విధించింది. దీంతో సిట్ దర్యాప్తు నిలిచిపోయింది. దానిమీద జగన్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో గట్టిగా వాదనలు వినిపించగా సిట్ దర్యాప్తు కొనసాగించవచ్చని , దానిమీద హైకోర్టు ఇచ్చిన స్టే ను ఎత్తేస్తున్నామని కోర్టు తేల్చి చెప్పింది. ఈమేరకు జస్టిస్ ఎం. ఆర్. షాలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. దీంతో ఇక మళ్ళీ సిట్ దర్యాప్తు పరుగులు పెడుతుందని అంటున్నారు.

గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్ష జరపొద్దు అని హైకోర్టు అంటే వంద శాతం రక్షణ కల్పించినట్టు కాదా? అని విచారణ సమయంలో వ్యాఖ్యానించిన సుప్రీం కోర్ట్ .. ప్రాథమిక దశలోనే దర్యాప్తును అడ్డుకోవడం సమంజసం కాదని ఏపీ ప్రభుత్వం వాదించింది. ఈ కేసును సిబిఐకి అప్పగించాలని కోరామన్న విషయాన్ని కూడా ప్రభుత్వం కోర్టుకు వివరించింది.

అలాంటిది అసలు దర్యాప్తు మీద స్టే ఎలా ఇస్తారని ఆంధ్రప్రదేశ్(AP) ప్రభుత్వం ప్రశ్నించింది. దీంతో రాష్ట్రప్రభుత్వ వాదనతో ఏకీభవించిన సుప్రీ కోర్ట్ ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేస్తూ సిట్ దర్యాప్తునకు మార్గం సుగమం చేసింది. ఇది జగన్ కు హుషార్ ఇచ్చే అంశం కాగా చంద్రబాబుకు మింగుడు పడని పరిణామంగా మారింది.