AP News| ప్రిన్సిపాల్ పై టీచ‌ర్ యాసిడ్ దాడి.. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో ఘ‌ట‌న

AP News| ప్రిన్సిపాల్ పై టీచ‌ర్ యాసిడ్ దాడి.. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో ఘ‌ట‌న

AP News| ఓ ఉపాధ్యాయురాలు .. ప్రిన్సిపాల్ పై దాడి చేసిన ఘ‌ట‌న ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో చోటు చేసుకున్న‌ది. త‌న‌ను స్కూల్ నుంచి స‌స్పెండ్ చేశార‌న్న అక్క‌సుతో ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డ‌ట్టు తెలుస్తున్నది.

జిల్లాలోని ఇబ్ర‌హీంప‌ట్నానికి చెందిన ప్రియ‌ద‌ర్శిని గుంటుప‌ల్లి డాన్ బాస్కో జిల్లాలో ఒక‌టి త‌ర‌గ‌తి ఉపాధ్యాయురాలిగా ప‌నిచేస్తున్న‌ది. ఇటీవ‌ల విద్యార్థుల‌ను కొడుతున్న‌ట్టు త‌రుచూ ఆరోప‌ణ‌లు రావ‌డంతో ప్రిన్సిపాల్ విజ‌య ప్ర‌కాశ్ ఆమెను స్కూల్ నుంచి సస్పెండ్ చేశారు.

దీంతో కోపం పెంచుకున్న ప్రియ‌ద‌ర్శిని సోమ‌వారం పాఠ‌శాల‌కు చేరుకున్న‌ది. త‌న‌ను ఎందుకు తొల‌గించారంటూ ప్రిన్సిపాల్ ను ప్ర‌శ్నించింది. ఈ క్ర‌మంలో ఇద్ద‌రి మ‌ధ్య మాటామాటా పెరిగింది. విచ‌క్ష‌ణ కోల్పోయిన ప్రియ‌ద‌ర్శిని ప్రిన్సిపాల్ పై దాడికి పాల్ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో ప్రిన్సిపాల్ తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. దీంతో ఆయ‌న‌ను గొల్ల‌పూడిలోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు అన్ని కోణాల్లో ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.