AP | బంగారం కోసం.. వృద్ధ మహిళను హత్య చేసిన వలంటీర్‌

AP | విధాత: బంగారం కోసం వృద్ధ మహిళను వలంటీర్‌ హత్య చేసిన ఘటన విశాఖ జిల్లా సుజాతనగర్‌లో జరిగింది. 95 వార్డు పురుషోత్తపురంలో వలంటీర్‌గా విధులు నిర్వహిస్తున్న వెంకట్‌ నెల రోజుల క్రితం మృతురాలి కొడుకు వద్ద ఫుడ్ కోర్ట్ లో పనికి చేరి వరలక్ష్మితో నమ్మకంగా మెలిగాడు. ఈ క్రమంలో ఓ రోజు సుజాత నగర్ 80ఫీట్ రోడ్డులో ఉంటున్న వరలక్ష్మి ఇంటికి వెళ్లిన వెంకట్ ఆమెను హత్య చేసి బంగారం, నగలతో ఉడాయించాడు. […]

  • By: krs    latest    Jul 31, 2023 7:43 AM IST
AP | బంగారం కోసం.. వృద్ధ మహిళను హత్య చేసిన వలంటీర్‌

AP |

విధాత: బంగారం కోసం వృద్ధ మహిళను వలంటీర్‌ హత్య చేసిన ఘటన విశాఖ జిల్లా సుజాతనగర్‌లో జరిగింది. 95 వార్డు పురుషోత్తపురంలో వలంటీర్‌గా విధులు నిర్వహిస్తున్న వెంకట్‌ నెల రోజుల క్రితం మృతురాలి కొడుకు వద్ద ఫుడ్ కోర్ట్ లో పనికి చేరి వరలక్ష్మితో నమ్మకంగా మెలిగాడు.

ఈ క్రమంలో ఓ రోజు సుజాత నగర్ 80ఫీట్ రోడ్డులో ఉంటున్న వరలక్ష్మి ఇంటికి వెళ్లిన వెంకట్ ఆమెను హత్య చేసి బంగారం, నగలతో ఉడాయించాడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా అతి స్వల్ప వ్యవధిలో హంతకుడిని పోలీసులు పట్టుకున్నారు. పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి వరలక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు.