AP | పవన్ కళ్యాణ్‌కు.. మహిళా కమిషన్ నోటీసులు
AP | మహిళల అదృశ్యం అన్నారు.. ఆధారాలు చూపండి విధాత: రాష్ట్రంలో దాదాపు 30 వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారు. వారిని వాలంటీర్లు ద్వారా ఒక మాఫియా గ్యాంగ్ మాయం చేస్తోంది. దీనికి సంబంధించిన సమాచారం నాకు కేంద్ర ఇంటలిజెన్స్ అధికారులు ఇచ్చారు అంటూ ఏలూరు సభలో ప్రసంగించినప వన్ కళ్యాణ్ కు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చేసింది. మీరు చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో.. ముఖ్యంగా మహిళల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అలా మహిళల […]

AP |
- మహిళల అదృశ్యం అన్నారు.. ఆధారాలు చూపండి
విధాత: రాష్ట్రంలో దాదాపు 30 వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారు. వారిని వాలంటీర్లు ద్వారా ఒక మాఫియా గ్యాంగ్ మాయం చేస్తోంది. దీనికి సంబంధించిన సమాచారం నాకు కేంద్ర ఇంటలిజెన్స్ అధికారులు ఇచ్చారు అంటూ ఏలూరు సభలో ప్రసంగించినప వన్ కళ్యాణ్ కు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చేసింది. మీరు చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో.. ముఖ్యంగా మహిళల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో అలా మహిళల అదృశ్యానికి సంబంధించిన ఆధారాలు ఉంటె ఇవ్వాలని, లేదా ఏ కేంద్ర నిఘా విభాగం చెప్పిందో తెలపాలని కోరుతూ కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ జనసేనానికి నోటీసులు జారీ చేసారు. తన వ్యాఖ్యలకు సంబంధింది పది రోజుల్లో ఆయన కానీ లేదా అయన ప్రతినిధి ద్వారా కానీ ఆధారాలు తమకు పంపించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.
మరోవైపు పవన్ వలంటీర్ల మీద చేసిన కామెంట్స్ మీద మంత్రులు.. ఎమ్మెల్యేలు విరుచుకు పడుతున్నారు. ఆధారాల్లేని ఆరోపణలతో పవన్ కళ్యాణ్ ప్రజలను భయానికి గురి చేస్తున్నారని ఎంపీ నందిగం సురేష్.. బందరు ఎమ్మెల్యే పేర్ని నాని తదితరులు ఆరోపించారు. పవన్ కేవలం తన రాజకీయ యజమాని చంద్రబాబు కోసం పని చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సైతం దూకుడుగా పవన్ మీద ఆరోపణలు చేస్తోంది.