Apple Sneakers | ఈ బూట్ల ధర వింటే.. గుండ దడదడే

Apple Sneakers విధాత‌: చిన్నా, పెద్దా అన్ని సరుకుల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ మధ్యనే టమాటా రేటు 350 రూపాయలకు పైగానే పెరిగింది. వాచ్ ల, బట్టల రేట్లు బాగా మీది కెక్కాయి. ఇప్పుడు అదే వరుసలో ఒక బూట్ల రేట్లు వింటేనే మన గుండె దడ పెరగొచ్చుఅంటే అందులో ఆశ్ఛర్యం ఏమి లేదు. ఈ బూట్లు ఆపిల్ కంపెనీ బూట్లు. టెక్నాలజీ వ్యాపారంలో ప్రముఖ బ్రాండ్ అయిన ఆపిల్, ఒకప్పుడు తన ఉద్యోగుల కోసం […]

  • By: Somu    latest    Jul 27, 2023 10:40 AM IST
Apple Sneakers | ఈ బూట్ల ధర వింటే.. గుండ దడదడే

Apple Sneakers

విధాత‌: చిన్నా, పెద్దా అన్ని సరుకుల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ మధ్యనే టమాటా రేటు 350 రూపాయలకు పైగానే పెరిగింది. వాచ్ ల, బట్టల రేట్లు బాగా మీది కెక్కాయి. ఇప్పుడు అదే వరుసలో ఒక బూట్ల రేట్లు వింటేనే మన గుండె దడ పెరగొచ్చుఅంటే అందులో ఆశ్ఛర్యం ఏమి లేదు. ఈ బూట్లు ఆపిల్ కంపెనీ బూట్లు.

టెక్నాలజీ వ్యాపారంలో ప్రముఖ బ్రాండ్ అయిన ఆపిల్, ఒకప్పుడు తన ఉద్యోగుల కోసం అత్యున్నత టెక్నాలజీతో మేలు రకమైన ఒక నమూనా స్మార్ట్ బూట్లను సృష్టించింది. ఇప్పుడు ఈ బూట్ల పట్ల ఆ కంపెనీ సిబ్బంది లో అంత మోజు లేనందున వాటిని విక్రయిస్తున్నారు. 1990ల మధ్యకాలంలో ప్రత్యేకంగా తయారు చేసిన జత బూట్లను కంపెనీ వేలం, బ్రోకరేజీ ద్వారా వేలం పోర్టల్‌లలో ఒకటైన సోథెబీస్‌లో వేలం వేశారు.

యాపిల్ తయారు చేసిన యుఎస్ సైజ్ 10.5లో పురుషుల కోసం తయారైన ఒక జత తెల్లటి బూట్లు ధర $50,000 సుమారు 41 లక్షల రూపాయలకు అమ్ముడు బోయింది. తన ఉద్యోగుల కోసం కస్టమ్-మేడ్, ఈ అల్ట్రా-రేర్ స్నీకర్స్ 90వ దశకం మధ్యలో జరిగిన నేషనల్ సేల్స్ కాన్ఫరెన్స్‌లో ఒక సారి బహుమతిగా కూడా ఇవ్వబడ్డాయి” అని వేలం హౌస్ కంపెనీ సోథెబైస్ తెలిపింది. సామాన్యుల ఊహకందని ఈబూట్ల రేటు విని ఒక్కసారే ముక్కన వేలు వేసు కొంటున్నారు విన్నవారంతా.