హార్వర్డ్ లా రివ్యూ అధ్యక్షురాలిగా అప్సర అయ్యర్.. 136 ఏళ్ల చరిత్రలో భారత సంతతి మహిళ పదవిని చేపట్టడం ఇదే తొలిసారి.!
Harvard Law Review | భారతీయ మహిళ అగ్రరాజ్యం అమెరికాలో చరిత్రను లిఖించింది. ఇండియన్ అమెరికన్ మహిళ అప్సర అయ్యర్ ప్రతిష్టాత్మక హార్వర్డ్ లా రివ్యూ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. 136 సంవత్సరాల లా రివ్యూ చరిత్రలో తొలిసారిగా భారత సంతతి మహిళ ఈ పదవిని ఇదే తొలిసారి. హార్వర్డ్ లా స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లా రివ్యూ న్యాయరంగంలో సాధారణ ప్రచురణల కోసం కథనాలను సమీక్షించి, ఎంపిక చేస్తుంటుంది. దీన్ని 1887లో స్థాపించారు. ‘ది హార్వర్డ్ క్రిమన్స్’ […]

Harvard Law Review | భారతీయ మహిళ అగ్రరాజ్యం అమెరికాలో చరిత్రను లిఖించింది. ఇండియన్ అమెరికన్ మహిళ అప్సర అయ్యర్ ప్రతిష్టాత్మక హార్వర్డ్ లా రివ్యూ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. 136 సంవత్సరాల లా రివ్యూ చరిత్రలో తొలిసారిగా భారత సంతతి మహిళ ఈ పదవిని ఇదే తొలిసారి. హార్వర్డ్ లా స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లా రివ్యూ న్యాయరంగంలో సాధారణ ప్రచురణల కోసం కథనాలను సమీక్షించి, ఎంపిక చేస్తుంటుంది. దీన్ని 1887లో స్థాపించారు. ‘ది హార్వర్డ్ క్రిమన్స్’ తన నివేదికలో హార్వర్డ్ లా రివ్యూ 137వ అధ్యక్షురాలిగా అప్సర అయ్యర్ ఎంపికైనట్లు తెలిపింది.
తనను లా రివ్యూ అధ్యక్షురాలిగా ఎంపిక చేసినందుకు అప్సర సంతోషం వ్యక్తం చేశారు. అప్సరా కంటే ముందు సుప్రీంకోర్టు న్యాయమూర్తి రూత్ బాడర్ గిన్స్‌బర్క్, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఈ సైతం ఈ పదవిని చేపట్టారు. అప్సర 2016లో యేల్ నుంచి పట్టభద్రురాలైంది. ఆర్థికశాస్త్రం, గణితం, స్పానిష్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉంది. అయ్యర్ లా స్కూల్‌లో చేరే ముందు 2018లో లా ఆఫీస్‌లో పనిచేశారు. అలాగే ‘రైట్-ఆన్’ అనే పోటీ ప్రక్రియ తర్వాత హార్వర్డ్ లా రివ్యూలో చేరారు. ఇక్కడ హార్వర్డ్ లా స్కూల్ విద్యార్థులు పత్రాలను కఠినంగా పరిశీలిస్తారు. అప్సర అయ్యర్ గతంలో హార్వర్డ్ లా స్కూల్‌కు చెందిన హార్వర్డ్ హ్యూమన్ రైట్స్ జర్నల్, నేషనల్ సెక్యూరిటీ జర్నల్‌లోనూ సేవలందించారు. ఆమె సౌత్ ఏషియన్ లా స్టూడెంట్స్ అసోసియేషన్‌లో సభ్యురాలు కూడా. 2018 నుంచి ఆర్ట్ క్రైమ్‌తో పాటు స్వదేశానికి తిరిగి వచ్చే వారి గురించి పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ పదవిలో ప్రిస్కిలా కొరోనాడో ఉన్నారు.