PUNJAB | ఆ నలుగురు జవాన్లను కాల్చింది సైనికుడే.. బఠిండా ఘటనపై వీడిన మిస్టరీ

అధికారులను పక్కదోవ పట్టించిన నిందితుడు మోహన్‌ దేశాయ్‌.. విచారణలో నేరం అంగీకారం విధాత‌: దేశ సరిహద్దు భద్రతలో కీలకంగా పంజాబ్‌ (PUNJAB) రాష్ట్రంలోని బఠిండా సైనిక స్థావరంలో కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనపై మిస్టరీ వీడింది. సైనిక జవానే నిందితుడని తేలింది. అధికారులను పక్కదోవ పట్టించిన నిందితుడు.. విచారణలో నేరాన్ని అంగీకరించినట్టు బఠిండ సీనియర్‌ సూపరిండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ గుల్నీత్‌ సింగ్‌ తెలిపారు. వ్యక్తిగత వైరంతోనే తోటి జవాన్లపై కాల్పులు జరిపినట్లు తెలిపారు. […]

  • By: Somu    latest    Apr 17, 2023 10:02 AM IST
PUNJAB | ఆ నలుగురు జవాన్లను కాల్చింది సైనికుడే.. బఠిండా ఘటనపై వీడిన మిస్టరీ
  • అధికారులను పక్కదోవ పట్టించిన నిందితుడు మోహన్‌ దేశాయ్‌.. విచారణలో నేరం అంగీకారం

విధాత‌: దేశ సరిహద్దు భద్రతలో కీలకంగా పంజాబ్‌ (PUNJAB) రాష్ట్రంలోని బఠిండా సైనిక స్థావరంలో కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనపై మిస్టరీ వీడింది. సైనిక జవానే నిందితుడని తేలింది. అధికారులను పక్కదోవ పట్టించిన నిందితుడు.. విచారణలో నేరాన్ని అంగీకరించినట్టు బఠిండ సీనియర్‌ సూపరిండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ గుల్నీత్‌ సింగ్‌ తెలిపారు. వ్యక్తిగత వైరంతోనే తోటి జవాన్లపై కాల్పులు జరిపినట్లు తెలిపారు.

ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈరోజు మోహన్‌దేశాయ్‌ అనే సైనికుడిని అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో తమను పక్కదోవ పట్టించిన జవాన్‌ నింతుడని, అతనే కాల్పులు జరిపినట్టు చెప్పారు. నిందితుడు సైనిక స్థావరంలో విధులు నిర్వహించేవాడని.. వ్యక్తిగత కారణాలతోనే కాల్పులు జరిపాడని తెలిపారు. కాల్పుల్లో మృతి చెందిన జవాన్లతో అతనికి వ్యక్తిగత వైరం ఉన్నట్టు గుల్నీత్‌ సింగ్‌ పేర్కొన్నారు.

ఈ నెల 12న బఠిండ సైనిక స్థావరంలో మిలటరీ స్టేషన్ లో శతఘ్ని విభాగానికి చెందిన బారెక్స్‌లో నలుగురు జవాన్లు నిద్రిస్తుండగా.. కాల్పుల ఘటన చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత బారెక్స్‌ నుంచి కుర్తా, పైజమా ధరించిన ఇద్దరు ముఖానికి మాస్కులతో బైటికి వెళ్లినట్టు నిందితుడు మోహన్‌ దేశాయ్‌ తెలిపాడు. ఆగంతకుల్లో ఒకరి చేతిలో ఇన్సాస్‌ రైఫిల్‌, మరొకరి చేతిలో గొడ్డలి చూసినట్టు సైనిక అధికారులకు వెల్లడించాడు.

ఈ కాల్పుల ఘటనపై పంజాబ్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాక్షిగా ఉన్న మేజర్‌ అశుతోష్‌ శుక్లా వాంగ్మూలం ఆధారంగా పంజాబ్‌ పోలీసులు ఇద్దరిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఆదివారం నలుగురు అనుమానిత జవాన్లను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే మోహన్‌ దేశాయ్‌ నేరం అంగీకరించినట్లు పోలీస్‌ వర్గాలు వెల్లడించాయి.