యాదాద్రిలో ముక్కోటి ఏకాదశికి ఏర్పాట్లు
విధాత: యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నందు జనవరి 2న ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉదయం 6:48 నిమిషాలకు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం భక్తులకు కల్పించడం జరుగుతుందని ఆలయ ఈవో గీత తెలిపారు. అలాగే జనవరి రెండో తేదీ నుండి ఏడవ తేదీ వరకు ఆరు రోజుల పాటు స్వామివారి అధ్యయనోత్సవాలు కొనసాగుతాయని తెలిపారు. అధ్యయనోత్సవాలు కొనసాగే ఆరు రోజుల పాటు ప్రధానాలయంలో నిత్యం భక్తులచే జరిపించబడే శ్రీ సుదర్శన నారసింహ హోమం, […]

విధాత: యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నందు జనవరి 2న ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఉదయం 6:48 నిమిషాలకు స్వామివారి ఉత్తర ద్వార దర్శనం భక్తులకు కల్పించడం జరుగుతుందని ఆలయ ఈవో గీత తెలిపారు.
అలాగే జనవరి రెండో తేదీ నుండి ఏడవ తేదీ వరకు ఆరు రోజుల పాటు స్వామివారి అధ్యయనోత్సవాలు కొనసాగుతాయని తెలిపారు. అధ్యయనోత్సవాలు కొనసాగే ఆరు రోజుల పాటు ప్రధానాలయంలో నిత్యం భక్తులచే జరిపించబడే శ్రీ సుదర్శన నారసింహ హోమం, నిత్య, శాశ్వత కళ్యాణం, నిత్య, శాశ్వత బ్రహ్మోత్సవాలు రద్దు చేయడం జరుగుతుందని తెలిపారు.
ప్రధాన ఆలయం నందు అధ్యయనోత్సవాలలో భాగంగా ఉదయం, సాయంత్రం అలంకార సేవలు ఘనంగా నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఉత్సవాలలో రెండవ తేదీ నుండి ఆరో తేదీ వరకు సాయంత్రం వరకు 4:30గంటల నుంచి 5:30గంటల వరకు వెండి జోడి మొక్కు సేవల ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
యాదాద్రి ప్రధానాలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ పాత గుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా జనవరి 2న ఉదయం 6:48 నిమిషాలకు స్వామివారి ఉత్తర ద్వారా దర్శనం భక్తులకు కల్పించడం జరుగుతుందన్నారు.