కృత్రిమ గర్భాలు: 9 నెలలు మోయకుండానే.. వేల మందిని కనొచ్చు?

ఒకే సారి 30 వేల శిశువులా.. ఎలా? అందుబాటులోకి కృత్రిమ గర్భాశయాలు? నెట్టింట్లో వైర‌ల్ అవుతున్న వీడియో విధాత‌: అమ్మో ప్రెగ్నెన్సీ? ఇప్పుడు నేను అఫర్డ్ చెయ్యలేను, ఇప్పుడిప్పుడే కెరీర్ సెట్ అవుతోంది కొత్తగా పెళ్లయిన నవ వధువు భయానికి అడ్డుకట్ట? గర్భాశ‌యం ఆరోగ్యం సరిగా లేక పిల్లలను కనాలని ఉన్నా కనలేని మరో స్త్రీలో నిర్లిప్తతకు ముగింపు? అందాలు పెట్టుబడిగా బతికే సెలబ్రిటీల సరోగసి కష్టాలు అన్నీ తీర్చేసే ఒకే ఒక పరికరం అందుబాటులోకి వస్తోందా? […]

కృత్రిమ గర్భాలు: 9 నెలలు మోయకుండానే.. వేల మందిని కనొచ్చు?
  • ఒకే సారి 30 వేల శిశువులా.. ఎలా?
  • అందుబాటులోకి కృత్రిమ గర్భాశయాలు?
  • నెట్టింట్లో వైర‌ల్ అవుతున్న వీడియో

విధాత‌: అమ్మో ప్రెగ్నెన్సీ? ఇప్పుడు నేను అఫర్డ్ చెయ్యలేను, ఇప్పుడిప్పుడే కెరీర్ సెట్ అవుతోంది కొత్తగా పెళ్లయిన నవ వధువు భయానికి అడ్డుకట్ట? గర్భాశ‌యం ఆరోగ్యం సరిగా లేక పిల్లలను కనాలని ఉన్నా కనలేని మరో స్త్రీలో నిర్లిప్తతకు ముగింపు?

అందాలు పెట్టుబడిగా బతికే సెలబ్రిటీల సరోగసి కష్టాలు అన్నీ తీర్చేసే ఒకే ఒక పరికరం అందుబాటులోకి వస్తోందా? ప్రస్తుతం ఒక కాన్సెప్ట్ వీడియో ఇంటర్నెట్‌లో హల్చల్ చేస్తోంది.ఈ వీడియోలో ఒక యంత్రంలో వేలాది గర్భాశయాల్లాంటి పరికరాలు. సంవత్సరానికి దాదాపు 30 వేల పాపాయిలు తయారవుతున్నారు?

కృత్రిమ గర్భం అనే మాట వినడానికే చాలా అబ్బురంగా ఉంది. ఇందులో శరీరానికి బయటే పిండం పెరిగి పాపాయి అవుతుంది. ఇప్పటి వరకు స్త్రీ తొమ్మిది నెలల పాటు రకరకాల కష్టనష్టాలను, ఇబ్బందులను ఓర్చుకుని బిడ్డకు జన్మనివ్వాల్సి ఉండేది. అలాంటి అవసరం లేకుండానే వేలాది పిల్లలను ఒక ఏడాదిలో కనిపెట్టే పరికరం అందుబాటులోకి వస్తే ఎలా ఉంటుంది? ఇలా వేలాది మంది పిల్లలను కృత్రిమంగా సృష్టించడం సాధ్య పడితే ఎలా ఉంటుంది?

మొదటిసారి ఇలా ఆర్టిఫిషియల్ ఊంబ్ గురించిన ఆలోచన మొదలైంది. ఈ విడియో నెటిజన్లను బాగా ఆకర్శించింది. వైరల్ గా మారింది. యశోధ సినిమా మరోసారి గుర్తు చేస్తోంది కదా. సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో ఇలాంటివి చూసినట్టు యూట్యూబ్ లో కొత్తగా షేర్ చేసిన ఈ కాన్సెప్ట్ వీడియో అలాంటి ఆలోచనకు రూపాన్ని ఇచ్చినట్టు ఉంది.

దీనికి ఎక్టోలైఫ్ అని పేరు పెట్టారు. ఈ పరిజ్ఞానం కనుక అందుబాటులోకి వస్తే సంవత్సరానికి దాదాపు 30 వేల మంది పిల్లలను తన గర్భాలలో పెంచగలదు ఈ యంత్రం. దాదాపు 50 సంవత్సరాల పైగా జరిపిన రకరకాల పరిశోధనల ఆదారంగా ఈ కాన్సెప్ట్ వీడియో రూపొందించారు.

బెర్లిన్ కు చెందిన బయోటెక్నాలజిస్ట్ హషేమ్ ఆల్ మైలీ ఈ నమూనాను రూపొందించారు. ఇది ఎప్పటికైనా అందుబాటులోకి వస్తే సంతానం లేని జంటలు తమ సొంత పిల్లలను ఈ కృత్రిమ గర్భంలో పెంచుకొని తల్లిదండ్రులుగా మారే అవకాశం ఉంటుందని ఈ వీడియో రూపకర్తలు అంటున్నారు.