సీఐపై హత్యాయత్నం

సీఐపై హత్యాయత్నం

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో సీఐపై హత్యాయత్నం కలకలం రేపింది. గురువారం ఉదయం సీసీఎస్ (సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్)లో సీఐగా పని చేస్తున్న ఇఫ్తార్ అహ్మద్‌పై జిల్లా కేంద్రంలోని ఓ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ ఈ దారుణానికి ఒడిగట్టినట్టు సమాచారం. కారులో ఉన్న సీఐపై… కానిస్టేబుల్ కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన సీఐని స్థానికులు జిల్లాకేంద్రంలోని ఎస్వీఎస్ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి డీఐజీ చౌహన్, ఎస్పీ హర్షవర్ధన్ చేరుకుని వివరాలు సేకరించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఈ సంఘటన పోలీసు వర్గాల్లో కలకలం రేపుతోంది.