పోలీసుల బండిలోనే బైరి నరేష్‌పై దాడి.. పోలీసులు వారించిన ఆగని హిందూ సంస్థ సభ్యులు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: గతంలో అయ్యప్పపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నాస్తికుడు బైరి నరేష్‌పై హిందూ సంస్థలకు చెందిన వ్యక్తులు పోలీసు వెహికల్‌లోనే ముకుమ్మడిగా దాడి చేసిన ఘటన సోమవారం హనుమకొండ గోపాలపురంలో జరిగింది. నడిరోడ్డుపై పోలీసు వెహికల్‌లో ఉన్న నరేష్‌పై పోలీసులు అడ్డుకుంటున్నప్పటికీ, లక్ష్యపెట్టకుండా వెహికల్ లోనే పిడిగుద్దలు గుద్దారు. View this post on Instagram A post shared by విధాత తాజా వార్తలు (@vidhaatha_news) వారి దాడి […]

  • By: krs    latest    Feb 27, 2023 2:35 PM IST
పోలీసుల బండిలోనే బైరి నరేష్‌పై దాడి.. పోలీసులు వారించిన ఆగని హిందూ సంస్థ సభ్యులు

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: గతంలో అయ్యప్పపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నాస్తికుడు బైరి నరేష్‌పై హిందూ సంస్థలకు చెందిన వ్యక్తులు పోలీసు వెహికల్‌లోనే ముకుమ్మడిగా దాడి చేసిన ఘటన సోమవారం హనుమకొండ గోపాలపురంలో జరిగింది. నడిరోడ్డుపై పోలీసు వెహికల్‌లో ఉన్న నరేష్‌పై పోలీసులు అడ్డుకుంటున్నప్పటికీ, లక్ష్యపెట్టకుండా వెహికల్ లోనే పిడిగుద్దలు గుద్దారు.

వారి దాడి నుంచి నరేష్‌ను కాపాడేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించాల్సి వచ్చింది. వెహికల్‌లో ఉన్న నరేష్ కేకలు, పెడబొబ్బలు వినిపించడంతో అటుగా పోయేవాళ్ళు ఆగి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఉన్న వ్యక్తిపై దాడికి తెగబడడం అన్యాయం అంటూ పేర్కొన్నారు.

నాస్తికుడు బైరి నరేష్ పై పోలీస్ వెహికిల్‌లో ప్రొటెక్షన్‌తో వెళ్తున్న నరేష్‌ని కిందకు లాగి దాడి చేశారు. ఒకసారి కేసు పెట్టి దాడి చేసిన తీరు మార్చుకోకుండా నేనింతే అన్నట్టు వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి పాల్పడ్డారు. అడ్డుకుంటున్న పోలీసులను మీరు హిందువులు కాదా అంటూ ప్రశ్నిస్తూ మరీ దాడి చేశారు.

పోలీసు వెహికల్‌లో ఉన్న వారికే రక్షణ లేకపోతే ఎలా అనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. అయితే నరేష్ పోలీస్ వెహికల్‌లోకి ఎలా వచ్చాడు దాడి చేసిన వారికి సమాచారం ఎలా తెలిసింది అనే సందేహాలు నివృత్తి కావలసి ఉంది.

ఇదిలా ఉండగా నడిరోడ్డుపై ప్రజలందరూ చూస్తుండగానే నరేష్ పై అత్యంత ఈ దారుణంగా జరిగిన దాడి సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ముందస్తు ప్రణాళిక ప్రకారమే నరేష్‌పై దాడి చేసినట్లు భావిస్తున్నారు.