యూత్ కాంగ్రెస్ నాయకుడు పవన్‌పై దాడి.. రేవంత్ మీటింగ్ సమయంలో ఘటన

కలకలం సృష్టించిన సంఘటన దవాఖానకు తరలింపు కారణాలు తెలియాల్సి ఉంది విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఒకవైపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్ సాగుతుండగానే మీటింగ్ స్థలానికి కొద్దిగా దూరంలో యువజన కాంగ్రెస్ నాయకుడు తోట పవన్ పై దాడి జరగడం కలకలం సృష్టించింది గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో పవన్ తీవ్రంగా గాయపడ్డాడు పవన్ పై దాడి జరిగిన విషయం కొద్దిసేపటికి తెలియడంతో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు అయితే […]

  • By: krs    latest    Feb 21, 2023 1:58 AM IST
యూత్ కాంగ్రెస్ నాయకుడు పవన్‌పై దాడి.. రేవంత్ మీటింగ్ సమయంలో ఘటన
  • కలకలం సృష్టించిన సంఘటన
  • దవాఖానకు తరలింపు
  • కారణాలు తెలియాల్సి ఉంది

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఒకవైపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్ సాగుతుండగానే మీటింగ్ స్థలానికి కొద్దిగా దూరంలో యువజన కాంగ్రెస్ నాయకుడు తోట పవన్ పై దాడి జరగడం కలకలం సృష్టించింది గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో పవన్ తీవ్రంగా గాయపడ్డాడు పవన్ పై దాడి జరిగిన విషయం కొద్దిసేపటికి తెలియడంతో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు అయితే తమ నేత మీటింగ్ జరుగుతున్న తరానికి కొద్ది దూరంలోనే ఈ దాడి సంఘటన జరగడంతో తీవ్ర కలకలం రేగింది ఈ దాడికి ఎవరు పాల్పడ్డారు అనే చర్చ సాగుతుంది ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సమయం చూసి పవన్ పై దాడి

ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హ‌న్మకొండ జిల్లా యువజన కాంగ్రెస్ నాయకుడు తోట ప‌వ‌న్‌పై గుర్తు తెలియ‌ని వ్యక్తులు దాడిచేసిన సంఘటన కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపింది. సోమ‌వారం రాత్రి హ‌న్మకొండ చౌర‌స్తాలో హ‌త్ సే హాత్ జోడో రేవంత్ యాత్రలో భాగంగా జ‌రిగిన కార్నర్ మీటింగ్‌లో కాంగ్రెస్ శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ స‌భ‌లో రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కు కొద్దిదూరంలో ఉన్న యువ నాయ‌కుడు తోట ప‌వ‌న్‌పై గుర్తు తెలియ‌ని వ్యక్తలు అత్యంత దారుణంగా దాడి చేశారు. పవన్ ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి రక్తస్రావం జరుగుతున్న పవన్ ను సహచరులు ఆల‌స్యంగా గుర్తించారు. తోటి కార్యక‌ర్తలు ఆయ‌న్ను వెంట‌నే ఆస్పత్రికి త‌ర‌లించారు.

ప్రస్తుతం తోట ప‌వ‌న్ అప‌స్మార‌క స్థితిలో ఉన్నాడు. ఈ సంఘ‌ట‌న సంచ‌ల‌నంగా మారింది. కాంగ్రెస్‌లో నెలకొన్న గ్రూపు తగాదాలే ప‌వ‌న్‌పై దాడికి కార‌ణ‌మా..? లేక ఇంకా ఇదే అదునుగా భావించి పవన్ అంటే పడని వారు దాడికి పాల్పడ్డారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. లేదా ఇతర ఏమైనా కార‌ణాలు ఉన్నాయా..? అనే విష‌యం తేలాల్సి ఉంది. పోలీసుల రంగ ప్రవేశం చేస్తే గాని పూర్తి వివరాలు తెలియ రావు.