గులాంనబీ ఆజాద్ కొత్త పార్టీ.. ‘డెమోక్రటిక్ ఆజాద్

విధాత: గులాంనబీ ఆజాద్ కొత్త పార్టీ పేరును ప్రకటించారు. 'డెమోక్రటిక్ ఆజాద్' పేరుతో పార్టీని ప్రారంభిస్తున్నట్లు ప్రక‌టించారు. జమ్మూకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని పునరుద్ధరించడం.. స్థానికుల భూమి, ఉపాధి హక్కులను పరిరక్షించడం తమ పార్టీ అజెండా అని చెప్పారు. ఈ సంద‌ర్భంగా తన కొత్త 'డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ' జెండాను ఆవిష్కరించారు. జెండాలోని మూడు రంగుల విశిష్ఠ‌త‌ల గురించి చెప్పారు. ఆవాల‌ రంగు సృజనాత్మకత ,భిన్నత్వంలో ఏకత్వాన్ని సూచిస్తుంది. తెలుపు శాంతిని సూచిస్తుంది. నీలం స్వేచ్ఛ, స్వేచ్ఛాయుత వాతావ‌ర‌ణం, […]

  • By: krs    latest    Sep 26, 2022 8:18 AM IST
గులాంనబీ ఆజాద్ కొత్త పార్టీ.. ‘డెమోక్రటిక్ ఆజాద్

విధాత: గులాంనబీ ఆజాద్ కొత్త పార్టీ పేరును ప్రకటించారు. ‘డెమోక్రటిక్ ఆజాద్’ పేరుతో పార్టీని ప్రారంభిస్తున్నట్లు ప్రక‌టించారు. జమ్మూకాశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని పునరుద్ధరించడం.. స్థానికుల భూమి, ఉపాధి హక్కులను పరిరక్షించడం తమ పార్టీ అజెండా అని చెప్పారు.

ఈ సంద‌ర్భంగా తన కొత్త ‘డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ’ జెండాను ఆవిష్కరించారు. జెండాలోని మూడు రంగుల విశిష్ఠ‌త‌ల గురించి చెప్పారు. ఆవాల‌ రంగు సృజనాత్మకత ,భిన్నత్వంలో ఏకత్వాన్ని సూచిస్తుంది. తెలుపు శాంతిని సూచిస్తుంది. నీలం స్వేచ్ఛ, స్వేచ్ఛాయుత వాతావ‌ర‌ణం, ఊహ‌, సముద్రపు లోతుల నుంచి ఆకాశం అంచుల‌ వరకు ఉన్న పరిమితులను సూచిస్తుందని అన్నారు.