Bro | ‘బ్రో’ కోసం ‘బేబీ’ త్యాగం.. మొత్తానికి మెగా ఫ్యాన్స్ అనిపించుకున్నారుగా..
Bro | ‘సొంత లాభం కొంత చూసుకుని’ అనే మాటను సినిమా జనాలు ముఖ్యంగా పాటిస్తారు.. లేదంటే మరో సినిమాకు వాళ్ళు ఉండరు. అలాంటిది సినిమా మేకింగ్‌లో పరస్పరం సాయం చేసుకోవడం, సహకరించు కోవడం కూడా చాలావరకూ తక్కువే. ప్రస్తుతం సినిమా సక్సెస్ మొదటి నాలుగు రోజుల్లోనే తెలిసిపోయి, రెండోవారానికల్లా థియేటర్స్ నుంచి ఎంతగొప్ప సినిమా అయినా వెళిపోతున్న తరుణమిది. అలాంటిది ‘బేబీ’ మూవీ విడుదలై మూడు వారాలు గడుస్తున్నా ఇంకా క్రేజ్ ఎక్కడా తగ్గలేదు. జూలై […]

Bro |
‘సొంత లాభం కొంత చూసుకుని’ అనే మాటను సినిమా జనాలు ముఖ్యంగా పాటిస్తారు.. లేదంటే మరో సినిమాకు వాళ్ళు ఉండరు. అలాంటిది సినిమా మేకింగ్‌లో పరస్పరం సాయం చేసుకోవడం, సహకరించు కోవడం కూడా చాలావరకూ తక్కువే. ప్రస్తుతం సినిమా సక్సెస్ మొదటి నాలుగు రోజుల్లోనే తెలిసిపోయి, రెండోవారానికల్లా థియేటర్స్ నుంచి ఎంతగొప్ప సినిమా అయినా వెళిపోతున్న తరుణమిది.
అలాంటిది ‘బేబీ’ మూవీ విడుదలై మూడు వారాలు గడుస్తున్నా ఇంకా క్రేజ్ ఎక్కడా తగ్గలేదు. జూలై 14న విడుదలైన ‘బేబీ’ చిత్రం.. ఇప్పటి వరకు దాదాపు రూ. 70 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇంకా మంచి టాక్‌తో దూసుకుపోతూనే ఉంది. చిన్న సినిమాగా విడుదలై ఎందరో మనసుల్ని తాకిన గొప్ప చిత్రంగా నిలిచింది.
‘బేబీ’ కథలోని పాయింట్ అందరినీ టచ్ చేసింది. ప్రేమించని హృదయమంటూ ఉండదు. అదే పాయింట్‌ని బేస్ చేసుకుని ఈ కథ సాగుతుంది. ఇలాంటి కంటెంట్‌తో సినిమాలు గతంలో వచ్చినప్పటికీ.. కాస్త గ్యాప్ తర్వాత ఈ జనరేషన్‌కి తగ్గట్టుగా ట్రయాంగిల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమాకి చాలామంది కనెక్ట్ అయ్యారు.. అవుతున్నారు. అంతేకాదు ఈ చిత్రానికి పలువురు ప్రముఖుల నుంచి ప్రసంశలు కూడా దక్కాయి.
అయితే హిట్ కొట్టాం కదాని గర్వ పడకుండా, దర్శకుడు సాయి రాజేష్, నిర్మాత SKN మెగా ఫ్యామిలీ నుంచి విడుదలైన మల్టీస్టారర్ ఫిల్మ్ ‘బ్రో’ కోసం తమ థియేటర్స్ కొన్ని వదులుకుని ఆ మూవీకి రూట్ క్లియర్ చేశారు. ‘బేబీ’ మూవీ దర్శకుడు, నిర్మాతలు వాళ్ళ సక్సెస్‌ను, కలెక్షన్స్‌ను పట్టించుకోకుండా మెగా ఫ్యామిలీకి తమ ఉదారతను చూపించుకునే తరుణం వచ్చిందని.. ముందుకు రావడం మెగా ఫ్యాన్స్‌లో ఆనందాన్ని నింపింది.
ఇది ఓ రకంగా ‘బేబీ’ చేస్తున్న త్యాగమే. ఈ రోజుల్లో లాభం చూసుకోని వ్యాపారం అస్సలు ఉండదు. అలాంటిది సినిమా రంగంలో అలా ఉంటే మరో సినిమాకు కనిపించమని, కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు. కానీ మెగా ఫ్యామిలీపై ఉన్న ఇష్టంతో ఇంతమంచి నిర్ణయం తీసుకున్న.. ‘బేబీ’ టీం చూపిన పెద్దమనసుకు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు.
‘బ్రో’ రూపంలో వచ్చిన అవకాశాన్ని ఈ రూపంలో ఉపయోగించుకుని మెగా అభిమానాన్ని కూడా దక్కించుకున్నారనే టాక్ కూడా వినిపిస్తుంది. రీసెంట్‌గా జరిగిన ‘బేబీ’ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి కూడా తన కుమారుడు, తమ్ముళ్లు, మేనల్లుళ్లు, అభిమానులు పొందుతున్న సక్సెస్ పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు.
‘బ్రో’ మూవీని త్రివిక్రమ్ శ్రీనివాస్ తన డైలాగ్స్‌తో మరో లెవల్‌కి తీసుకుని వెళ్ళాడు. చాలా క్లారిటీతో కథను నడిపించిన తీరు హిట్ ఖాయమని ముందే హింట్ ఇచ్చినట్లయింది. ‘బ్రో’ సినిమాకు సముద్రఖని దర్శకుడు.. తమన్ సంగీతం కాస్త నిరుత్సాహంలోకి తోసేసినా మొత్తానికి ‘బ్రో’ కలెక్షన్స్ మాత్రం ఆశాజనకంగా ఉన్నాయి.
మొదటి మూడు రోజులలో 60 శాతం వరకు రికవరీ అయినట్లుగా టాక్ వినబడుతోంది. ‘బేబీ’ త్యాగం, వరుణుడు కాస్త శాంతించడం వంటి అంశాలతో.. బెనిఫిట్ షోలు, టికెట్స్ హైక్ లేకుండానే 60 శాతం రికవరీ అంటే అది పవన్ కళ్యాణ్‌కే సాధ్యం అనేలా ప్రస్తుతం ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.