ప్రొఫెసర్ సాయిబాబాకు సుప్రీంలో ఎదురుదెబ్బ.. బాంబే హైకోర్టు తీర్పుపై స్టే
విధాత: ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టులతో సంబంధాల కేసులో సాయిబాబా సహా ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే బాంబే హైకోర్టు తీర్పుపై ఎన్ఐఏ, మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బాంబే హైకోర్టు తీర్పును సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సాయిబాబాతో పాటు మిగతావారిని జైలు నుంచి విడుదల చేయడంపై స్టే విధించింది. తన వైకల్యాన్ని దృష్టిలో ఉంచుకుని సాయిబాబా ఇంట్లోనే ఉండేందుకు […]

విధాత: ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టులతో సంబంధాల కేసులో సాయిబాబా సహా ఐదుగురిని నిర్దోషులుగా ప్రకటిస్తూ బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే బాంబే హైకోర్టు తీర్పుపై ఎన్ఐఏ, మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
బాంబే హైకోర్టు తీర్పును సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సాయిబాబాతో పాటు మిగతావారిని జైలు నుంచి విడుదల చేయడంపై స్టే విధించింది. తన వైకల్యాన్ని దృష్టిలో ఉంచుకుని సాయిబాబా ఇంట్లోనే ఉండేందుకు అవకాశం ఇవ్వాలని ఆయన తరఫున న్యాయవాది చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది. సుప్రీం ఉత్తర్వుల నేపథ్యంలో వారి జీవిత ఖైదు శిక్ష కొనసాగనున్నది.
ప్రొఫెసర్ సాయిబాబాకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సాయిబాబ తరఫున న్యాయవాది బసంత్ నోటీసులు అంగీకరించారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు సస్పెన్షన్ కొనసాగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో సాయిబాబాతో పాటు మిగిలిన నిందితులు నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. కేసు విచారణను సుప్రీం ధర్మాసనం డిసెంబర్ 8వ తేదీకి వాయిదా వేసింది.