మహేశ్వరంలో పారిజాతం నామినేషన్.. పరేషాన్‌లో కేఎల్‌ఆర్ వర్గం

విధాత : మహేశ్వరం నియోకవర్గం కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన బడంగ్‌పేట్ మేయర్ పారిజాతం నరసింహారెడ్డి శనివారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్‌ను కేఎల్‌ఆర్‌కు కేటాయించారు. అయితే పారిజాతం తన నామినేషన్‌లో తాను కాంగ్రెస్ అభ్యర్థినంటూ పేర్కోన్నారు. పారిజాతం అనూహ్యంగా నామినేషన్ వేయడంతో కేఎల్‌ఆర్ వర్గీయులను పరేషాన్‌లో పడేసింది.
కేఎల్‌ఆర్ ఇంకా తన నామినేషన్ దాఖలు చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ బీ ఫామ్ దక్కిన వారే అధికారికంగా కాంగ్రెస్ అభ్యర్థి అవుతారు. కేఎల్‌ఆర్‌ను కాంగ్రెస్ హైకమాండ్ అభ్యర్థిగా ప్రకటించాక కూడా పారిజాతం ఈ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నించారు. ఏకంగా నామినేషన్ కూడా దాఖలు చేయడంతో మునుముందు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ కేఎల్‌ఆర్ వర్గీయులను కలవరపెడుతుంది. ఇటీవలే కేఎల్‌ఆర్ నివాసంతో పాటు పారిజాతం ఇంట్లో కూడా ఐటీ దాడులు జరిగాయి.