రూ.200 కోట్ల మ‌నీలాండ‌రింగ్ కేసు.. ప్రభాస్‌ హీరోయిన్‌కు బెయిల్‌

విధాత: బాలీవుడ్ న‌టి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు రూ.200 కోట్ల మ‌నీలాండ‌రింగ్ కేసులో ఢిల్లీ ప‌టియాల హౌస్ కోర్టు మ‌ధ్యంత‌ర బెయిల్ మంజూరు చేసింది. మ‌నీలాండ‌రింగ్ కేసులో జాక్వెలిన్‌కు ఈడీ స‌మ‌న్లు జారీ చేసింది. జాక్వెలిన్ మ‌ధ్యంత‌ర బెయిల్‌పై ప‌టియాల కోర్టు ఈడీ వివ‌ర‌ణ కోరింది. రూ. 50 వేల పూచీక‌త్తుపై ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. త‌దుప‌రి విచార‌ణ‌ను అక్టోబ‌ర్ 22కు వాయిదా వేసింది. బాలీవుడ్ నటి జాక్వెలిన్‌ ఓ మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కున్నవిషయం విదిత‌మే. […]

  • By: krs    latest    Sep 26, 2022 8:40 AM IST
రూ.200 కోట్ల మ‌నీలాండ‌రింగ్ కేసు.. ప్రభాస్‌ హీరోయిన్‌కు బెయిల్‌

విధాత: బాలీవుడ్ న‌టి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు రూ.200 కోట్ల మ‌నీలాండ‌రింగ్ కేసులో ఢిల్లీ ప‌టియాల హౌస్ కోర్టు మ‌ధ్యంత‌ర బెయిల్ మంజూరు చేసింది. మ‌నీలాండ‌రింగ్ కేసులో జాక్వెలిన్‌కు ఈడీ స‌మ‌న్లు జారీ చేసింది. జాక్వెలిన్ మ‌ధ్యంత‌ర బెయిల్‌పై ప‌టియాల కోర్టు ఈడీ వివ‌ర‌ణ కోరింది. రూ. 50 వేల పూచీక‌త్తుపై ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. త‌దుప‌రి విచార‌ణ‌ను అక్టోబ‌ర్ 22కు వాయిదా వేసింది.

బాలీవుడ్ నటి జాక్వెలిన్‌ ఓ మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కున్నవిషయం విదిత‌మే. ఆర్థిక నేరగాడు సుకేష్ చంద్రశేఖర్ ప్రధాని నిందితుడిగా ఉన్న మనీలాండరింగ్ కేసులో ఆమెను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నిందితురాలిగా పేర్కొంది. ఆమె పేరును ఛార్జ్ షీట్‌లో చేర్చింది.

ప్రభాస్‌ నటించిన సాహో చిత్రంలో ఓ స్పెషల్‌ సాంగ్‌ ద్వారా జాక్వెలిన్‌ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. బాలీవుడ్‌లో సల్మాన్‌ ఖాన్‌తో రెండు చిత్రాలు హీరోయిన్‌గా కూడా చేసింది.