బజరంగ్ దళ్‌కు కాదేది అనర్హం.. పుట్టిన రోజుపై వివాదం
లవ్ జీహాద్‌కు పాల్పడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు వెనకేసుకొచ్చిన పోలీసులు విధాత: హిందుత్వ మూకల ఆగడాలకు అంతులేకుండా పోతున్నది. మధ్యప్రదేశ్ ఇండోర్‌లో పుట్టిన రోజు వేడుకలను సైతం బజరంగ్ దళ్ కార్యకర్తలు వివాదం చేశారు. అందులో ముస్లింలు పాల్గొన్నారన్న కారణంతో లవ్ జీహాద్ నెపంతో వారిపై దాడి చేశారు. ఇండోర్‌లో ఓ ప్రైవేట్ అపార్ట్‌మెంటులో నివాసం ఉంటున్న ఓ మహిళ బర్త్‌డే వేడుకులను తన మిత్రులతో నిర్వహించుకొంటున్నది. అతిథుల్లో ఐదుగురు ముస్లింలు ఉన్నట్లు తెలుసుకున్న బజరంగ్ దళ్ కార్యకర్తలు […]

- లవ్ జీహాద్‌కు పాల్పడుతున్నారని పోలీసులకు ఫిర్యాదు
- వెనకేసుకొచ్చిన పోలీసులు
విధాత: హిందుత్వ మూకల ఆగడాలకు అంతులేకుండా పోతున్నది. మధ్యప్రదేశ్ ఇండోర్‌లో పుట్టిన రోజు వేడుకలను సైతం బజరంగ్ దళ్ కార్యకర్తలు వివాదం చేశారు. అందులో ముస్లింలు పాల్గొన్నారన్న కారణంతో లవ్ జీహాద్ నెపంతో వారిపై దాడి చేశారు.
ఇండోర్‌లో ఓ ప్రైవేట్ అపార్ట్‌మెంటులో నివాసం ఉంటున్న ఓ మహిళ బర్త్‌డే వేడుకులను తన మిత్రులతో నిర్వహించుకొంటున్నది. అతిథుల్లో ఐదుగురు ముస్లింలు ఉన్నట్లు తెలుసుకున్న బజరంగ్ దళ్ కార్యకర్తలు తమను పిలవలేదని అక్కసుతో భర్త్‌డే పార్టీపై దాదాపు వంద మంది దాడి చేసి నానాయాగి చేశారు. ముస్లింలు లవ్ జిహాద్‌కు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు కూడా బజరంగ్ దళ్ కార్యకర్తలను వెనకేసుకొచ్చారు. వారు చెప్పిందే వేదంగా నడుచుకున్నారు. ముస్లింలను అరెస్టు చేసి ఐపీసీ 151సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. నలుగురు కంటె ఎక్కువ మంది చట్టవిరుద్ధంగా గుమికూడారన్న విషయంపై కేసు పెట్టారు. పుట్టినరోజు ఫంక్షన్‌పై దాడి చేసిన బజరంగ్ దళ్ కార్యకర్తలపై పోలీసులు ఏ చర్యా తీసుకోలేదు.