Bala Krishna:నాన్న మీద అంత ప్రేమ‌నా.. బాల‌య్య కోసం బ్రాహ్మ‌ణీ ఏం చేస్తుందో తెలిస్తే షాక‌వుతారు…

Bala Krishna:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణకు ముగ్గురు పిల్లలు అనే సంగతి అందరికీ తెలిసిందే. ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు. పెద్ద కూతురు బ్రాహ్మణిని నారా లోకేష్ తో ఏడడుగులు వేసి చంద్రబాబు ఇంటికి కోడలిగా అడుగు పెట్టారు. ఇక రెండో కూతురు తేజస్విని గీతం విద్యా సంస్థల అధినేత శ్రీభరత్ ను పెళ్లి చేసుకున్నారు. ఇక కొడుకు మోక్షజ్ఞ తేజ ఇప్పుడు నందమూరి బాలకృష్ణకు నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారు. బాలకృష్ణ ముగ్గురు పిల్లల్లో నాన్న […]

  • By: sn    latest    Jul 15, 2023 9:34 AM IST
Bala Krishna:నాన్న మీద అంత ప్రేమ‌నా.. బాల‌య్య కోసం బ్రాహ్మ‌ణీ ఏం చేస్తుందో తెలిస్తే షాక‌వుతారు…

Bala Krishna:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణకు ముగ్గురు పిల్లలు అనే సంగతి అందరికీ తెలిసిందే. ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు. పెద్ద కూతురు బ్రాహ్మణిని నారా లోకేష్ తో ఏడడుగులు వేసి చంద్రబాబు ఇంటికి కోడలిగా అడుగు పెట్టారు. ఇక రెండో కూతురు తేజస్విని గీతం విద్యా సంస్థల అధినేత శ్రీభరత్ ను పెళ్లి చేసుకున్నారు. ఇక కొడుకు మోక్షజ్ఞ తేజ ఇప్పుడు నందమూరి బాలకృష్ణకు నటవారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారు. బాలకృష్ణ ముగ్గురు పిల్లల్లో నాన్న అంటే నారా బ్రాహ్మణికే ఎక్కువ ఇష్టమట. చిన్నతనం నుండి బ్రాహ్మణికి తండ్రి అంటే ఎంతో ప్రేమ. అంతకు మించిన గౌరవం కూడా ఉంది.

ఇక ఫస్ట్ కూతురు కాబట్టి బాలయ్య ఎక్కువ గారాబం చేశారట. బ్రాహ్మణి బిజినెస్ రంగంలో తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది. అమెరికాలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ చేసిన బ్రాహ్మణి.. సక్సెస్ ఫుల్ బిజినెస్ పర్సన్ గా ఎదిగారు. ముఖ్యంగా బ్రాహ్మణి హెరిటేజ్ ఫుడ్స్ కంపెనీలో బ్రాహ్మణి కీలక పొజిషన్ లో ఉన్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక తన తండ్రి బాలకృష్ణ మీద ఉన్న ప్రేమతో ప్రతి ఏడాది ఓ పని చేస్తున్నారు. ప్రతి ఏడాది బాలకృష్ణ పుట్టిన రోజున వెయ్యి మందికి పైగా అనాథలకు అన్నదానం చేస్తుందట. చదువుకునే రోజుల నుండే ఈ గొప్ప పనికి బ్రాహ్మణి శ్రీకారం చుట్టిందట.

ఇప్పటికీ దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. కానీ ఈ విషయం ఎప్పుడూ కూడా బ్రాహ్మణి పబ్లిసిటీ చేయలేదు. ముఖ్యంగా బ్రాహ్మణికి పొగడ్తలు అన్నా.. చేసిన మంచి పని గురించి పబ్లిసిటీ చేసుకోవాలన్నా అస్సలు నచ్చిన పని అంటుంది. తన తండ్రి పేరు మీద పదిమందికి ఆకలి తీర్చాననే సంతోషం, తృప్తి ఉంటే చాలు అనుకుంటుందట. ఇక బ్రాహ్మణి ఎప్పటికప్పుడూ తన బిజినెస్ వర్క్ షాప్స్ లోనూ, మీటింగ్స్ లోనూ పాల్గొంటూ వైరల్ అవుతుంటుంది.