చిత్తూరు జిల్లా కుప్పం యువగళం పాదయాత్ర సమయంలో తీవ్ర అస్వస్థతకు గురైన నటుడు నందమూరి తారకరత్న పరిస్థితి ఇంకా విషమయంగానే ఉన్నది. బెంగళూరులోని నారాయణ హృదయాల ఆస్పత్రిలో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. తారకరత్నను చూడటానికి సినీ నటులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ తమ కుటుంబసభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో బెంగళూరుకు చేరుకున్నారు. బాలకృష్ణ సతీమణి వసుంధర, నారా లోకేశ్ సతిమణి బ్రాహ్మణి, ఇతర కుటుంసభ్యులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. మరోవైపు కర్ణాకట రాష్ట్ర వైద్య శాఖ మంత్రి కూడా ఆస్పత్రికి వచ్చారు. వైద్యులను అడిగిన తారకరత్న తాజా ఆరోగ్య పరిస్థితి వారు ఆరా తీశారు.
తారకరత్న పరిస్థితి నిన్నటి కంటే మెరుగ్గా ఉన్నదని నటుడు బాలకృష్ణ అన్నారు. వైద్యసేవలకు అతను స్పందిస్తున్నాడు. తారకరత్న కోలుకోవాలని అభిమానులు ప్రార్థించాలని బాలకృష్ణ కోరారు.