బీజేపీకి టచ్‌లో 8 మంది బీఆరెస్ ఎమ్మెల్యేలు, 5గురు ఎంపీలు

బీఆరెస్‌కు చెందిన 8మంది ఎమ్మెల్యేలు, 5గురు సిటింగ్ ఎంపీలు బీజేపీకి టచ్‌లో ఉన్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు

  • By: Somu    latest    Feb 16, 2024 10:53 AM IST
బీజేపీకి టచ్‌లో 8 మంది బీఆరెస్ ఎమ్మెల్యేలు, 5గురు ఎంపీలు
  • బీఆరెస్‌తో పొత్తు ఎప్పటికి ఉండదు
  • బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు


విధాత, హైదరాబాద్‌ : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆరెస్‌కు చెందిన 8మంది ఎమ్మెల్యేలు, 5గురు సిటింగ్ ఎంపీలు టచ్‌లో ఉన్నారని, రానున్న రోజుల్లో బీఆరెస్ నుంచి బీజేపీలోకి భారీగా వలసలుంటాని సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆరెస్ అధినేత కేసీఆర్ తన పార్టీని కాపాడుకునే ప్రయత్నంలో భాగాంగానే బీజేపీతో బీఆరెస్ పొత్తు ఉండబోతుందన్న ప్రచారాన్ని చేయిస్తున్నారని మండిపడ్డారు.


ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆరెస్‌తో బీజేపీ పొత్తు ఉండబోదన్నారు. బీఆరెస్ అధికారంలో ఉన్నప్పుడే ఎన్‌డీఏలో ఆ పార్టీని చేర్చుకోలేదన్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఉంటే ఇప్పటికే కేసీఆర్ జైల్లో ఉండేవారన్నారు. కేసీఆర్ అవినీతి గూర్చి మొదట మాట్లాడిందే ప్రధాని మోడీ అని గుర్తు చేశారు. కేంద్రంలో మోడీ సారధ్యంలో బీజేపీ మూడోసారి విజయం సాధించి అధికారంలోకి రాబోతుందన్నారు. తెలంగాణలో 17సీట్లకు 17సీట్లు గెలవబోతున్నామని జోస్యం చెప్పారు.