పవన్ భక్తుడికి మరోసారి పూనకం..! వైర‌ల్ అవుతున్నట్వీట్‌

విధాత‌: బండ్ల గణేష్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అప్పుడెప్పుడో ఎస్వీ కృష్ణారెడ్డి చిత్రాలలో చిన్న చిన్న కామెడీ పాత్రలు చేస్తూ.. ఆ తర్వాత డబ్బు కోసం నట్టి కుమార్ నిర్మాతగా ప్లీజ్ ఆంటీ సినిమాలో నటించాడు. ఆ తర్వాత విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడున్న కమెడియన్లలో తనకు కష్టమని భావించి నిర్మాత అవతారం ఎత్తాడు. బ్లాక్ బస్టర్ నిర్మాతగా గుర్తింపు పొందాడు. పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని అయిన ఈ అపర భక్తుడు […]

  • By: krs    latest    Dec 08, 2022 3:30 PM IST
పవన్ భక్తుడికి మరోసారి పూనకం..! వైర‌ల్ అవుతున్నట్వీట్‌

విధాత‌: బండ్ల గణేష్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. అప్పుడెప్పుడో ఎస్వీ కృష్ణారెడ్డి చిత్రాలలో చిన్న చిన్న కామెడీ పాత్రలు చేస్తూ.. ఆ తర్వాత డబ్బు కోసం నట్టి కుమార్ నిర్మాతగా ప్లీజ్ ఆంటీ సినిమాలో నటించాడు. ఆ తర్వాత విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడున్న కమెడియన్లలో తనకు కష్టమని భావించి నిర్మాత అవతారం ఎత్తాడు. బ్లాక్ బస్టర్ నిర్మాతగా గుర్తింపు పొందాడు.

పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని అయిన ఈ అపర భక్తుడు పవన్ మీద ఎవరైనా కామెంట్ చేసినా, పవన్‌ని ఏమైనా అన్నా.. వెంటనే తనదైన ఘాటు పదజాలంతో విరుచుకుప‌డ‌తాడు. పోయి పోయి వీడితో ఎందుకు పెట్టుకున్నామా? అని ఎదుటివారు తలలు పట్టుకునేలా చేస్తాడు. సినిమాలు మానేసి.. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో హడావుడి చేస్తూ.. వర్మ తర్వాత నేనే అనేలా యమా యాక్టివ్‌గా ఉంటున్నాడు.

ఆ మ‌ధ్య రాజ‌కీయాల‌లోకి ఎంట్రీ ఇచ్చి.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల‌లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయాల‌ని భావించి భంగ‌ప‌డ్డాడు. ఒకవైపు రాజకీయాలు చూస్తూనే మరోవైపు నిర్మాతగా మారి సినిమాలు నిర్మించాడు. పవన్ కళ్యాణ్‌తో తీసిన ‘తీన్‌మార్’ చిత్రం బాగా నష్టపరచడంతో.. వెంటనే పవర్ స్టారే ఆయనకు ‘గబ్బర్ సింగ్’ సినిమా చేసే అవకాశం ఇచ్చాడు. ఈ చిత్రం నాటి రికార్డులను బద్దలు కొట్టింది. అక్కడి నుం బండ్లన్న దశ తిరిగిపోయింది. ఆ సినిమా తర్వాత నుండి పవన్ ఆయనకి దేవుడైపోయాడు.

అయితే బండ్ల గణేష్ ఏది మాట్లాడినా అది ద్వంద్వార్థం నిండి ఉంటుంది. ఆయన వ్యాఖ్యలు గమనిస్తే ఎదుటి వారిని విమర్శిస్తున్నాడా? ప్రశంసిస్తున్నాడా? అనేది అర్థం కాక.. ఎంతటి వారైనా జుట్టు పీక్కుంటారు. తాజాగా పవన్ కళ్యాణ్‌పై బండ్ల గణేష్ వేసిన ఓ ట్వీట్ పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. మీడియా సంస్థలు కూడా దీనిపై భారీ కథనాలు ప్రచురిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ తాజాగా ‘సాహో’ చిత్ర దర్శకుడు సుజిత్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ప్రభాస్ తర్వాత మరోసారి స్టార్ హీరోతో ఛాన్స్ కొట్టేయడం అతని అదృష్టమనే చెప్పాలి.

ఈ చిత్రానికి ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాత డివివి దానయ్య నిర్మాత. ఈ భారీ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కాన్సెప్ట్ పోస్టర్ కూడా విడుదల చేశారు. దర్శకుడు సుజీత్ కూడా కథ గురించి చిన్న హింట్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ ఈ మూవీలో ఒరిజినల్ గ్యాంగ్‌స్టార్ పాత్రను పోషిస్తున్నాడని, ఇది జపాన్-ముంబై నేపథ్యంలో సాగే చిత్రమని తెలుస్తోంది. గతంలో పవన్ కళ్యాణ్ విష్ణువర్ధన్ దర్శకత్వంలో కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో ‘పంజా’ చిత్రం చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కూడా దాదాపు అదే ఛాయల్లో ఉంటుందనేలా టాక్ వినిపిస్తోంది.

ఈ సందర్భంగా.. బండ్ల గణేష్ .. ‘‘వరాలు ఇచ్చే గుడికి వెళ్దాం.. దాంతో పాటు ప్రసాదం కూడా తిందాం.. లేకపోతే టైం వేస్ట్.. టైం ఎక్కువ లేదు మన ఫ్యామిలీకి ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వాలి’’ అని ట్వీట్ చేశాడు. పవన్ కొత్త మూవీ ప్రకటించిన నేపథ్యంలో ఆ చిత్రం కోసం తాను ఎంతో ఎదురు చూస్తుండగా మరో నిర్మాత దానయ్యకు ఈ అవకాశం లభించడంతో బండ్ల గణేష్ ఇలా మాట్లాడాడనేలా నెటిజన్లు కామెంట్స్ స్టార్ట్ చేశారు.

చాలా కాలంగా బండ్ల గణేష్.. పవన్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాడు. తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని పవన్‌ని కోరుకుంటున్నాడు. ఎప్పటికప్పుడు తన ఆశను తెలుపుకుంటూనే వస్తున్నాడు.. కానీ, తనకి కాకుండా మరో నిర్మాతకు ఛాన్స్ ఇవ్వడంతో.. కోపంతోనే బండ్ల ఇలాంటి ట్వీట్ చేశారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఈ వార్తలపై బండ్ల గణేష్ క్లారిటీ కూడా ఇచ్చాడండోయ్.. ‘జీవితంలో పవన్ కళ్యాణ్ మీద హర్ట్ కావడం అనేది ఉండదు. నా బాస్‌ను ఎప్పుడూ గౌరవిస్తూనే ఉంటా’ అని తెలిపాడు. మరో ట్వీట్‌లో ‘భారత చలన చిత్ర పరిశ్రమలో నంబర్ వన్ చిత్రంగా నిలవాలని, నిలిచే విధంగా రూపొందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బండ్ల గణేష్’ అని పోస్ట్ చేశాడు. దీంతో వాతావరణం కాస్త చల్లబడింది.