Bangaru Maisamma | అమ్మవారి ఆశీస్సులతో మళ్లీ సీఎంగా కేసీఆర్: శాసన మండలి చైర్మన్ గుత్తా
Bangaru Maisamma విధాత: సీఎం కేసీఆర్ మూడోసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా కావాలని బంగారు మైసమ్మ అమ్మవారి ఆశీస్సులు కోరినట్లుగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం తెలంగాణ శాసన సభ ప్రాంగణంలో బంగారు మైసమ్మ బోనాల పండుగ కార్యక్రమంలో పాల్గొన్న గుత్తా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సకాలంలో వానలు కురిసి రాష్ట్రం పచ్చగా ఉండాలని , రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని, కేసీఆర్ ని మూడో సారి ముఖ్యమంత్రిగా […]

Bangaru Maisamma
విధాత: సీఎం కేసీఆర్ మూడోసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా కావాలని బంగారు మైసమ్మ అమ్మవారి ఆశీస్సులు కోరినట్లుగా శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. మంగళవారం తెలంగాణ శాసన సభ ప్రాంగణంలో బంగారు మైసమ్మ బోనాల పండుగ కార్యక్రమంలో పాల్గొన్న గుత్తా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన సకాలంలో వానలు కురిసి రాష్ట్రం పచ్చగా ఉండాలని , రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని, కేసీఆర్ ని మూడో సారి ముఖ్యమంత్రిగా ఆశీర్వదించాలని అమ్మ వారిని కోరుకున్నట్లుగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, శాసన మండలి విప్ ఏం. ఎస్ ప్రభాకర్ రావు, ఎమ్మెల్యేలు పద్మ దేవేందర్ రెడ్డి,రేఖ నాయక్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి,కాలే యాదయ్య, సుంకే రవి శంకర్ ,ఎమ్మెల్సీలు యాదవ రెడ్డి,వాణి దేవి, మాజీ ఎమ్మెల్సీ విజి గౌడ్, తెలంగాణ లెజిస్లేచర్ సెక్రెటరీ నరసింహా చార్యులు,బి ఆర్ యస్ ఎల్పీ రమేష్ రెడ్డి, శాసన మండలి,శాసన సభ ఉద్యోగులు ,తదితరులు పాల్గొన్నారు.