ఫిబ్ర‌వ‌రిలో బ్యాంకుల‌కు భారీగా సెల‌వులు.. ఎన్ని రోజులంటే..?

విధాత‌: ఒక నెల ముగిసిపోయి, మ‌రో నెల వ‌స్తుందంటే.. సెల‌వుల గురించి ఆలోచిస్తాం. వ‌చ్చే నెల‌లో ఎన్ని రోజులు సెలవులు వ‌స్తున్నాయి.. అనే విష‌యాల‌పై ఆరా తీస్తుంటాం. మ‌రీ ముఖ్యంగా బ్యాంకుల సెలవుల‌పై దృష్టి సారిస్తాం. నిత్యం లావాదేవీలు జ‌రిపే ఖాతాదారులు.. ముందే సెల‌వుల గురించి తెలుసుకుని, త‌మ కార్య‌క‌లాపాల‌ను ప్లాన్ చేసుకుంటారు. ప్ర‌స్తుతం ఆన్‌లైన్ బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ ఉన్న‌ప్ప‌టికీ, భారీ మొత్తంలో జ‌రిగే లావాదేవీల‌కు బ్యాంక్‌కు వెళ్ల‌క త‌ప్ప‌దు. అయితే ఫిబ్ర‌వ‌రి నెల‌లో బ్యాంకుల సెల‌వులకు […]

ఫిబ్ర‌వ‌రిలో బ్యాంకుల‌కు భారీగా సెల‌వులు.. ఎన్ని రోజులంటే..?

విధాత‌: ఒక నెల ముగిసిపోయి, మ‌రో నెల వ‌స్తుందంటే.. సెల‌వుల గురించి ఆలోచిస్తాం. వ‌చ్చే నెల‌లో ఎన్ని రోజులు సెలవులు వ‌స్తున్నాయి.. అనే విష‌యాల‌పై ఆరా తీస్తుంటాం. మ‌రీ ముఖ్యంగా బ్యాంకుల సెలవుల‌పై దృష్టి సారిస్తాం.

నిత్యం లావాదేవీలు జ‌రిపే ఖాతాదారులు.. ముందే సెల‌వుల గురించి తెలుసుకుని, త‌మ కార్య‌క‌లాపాల‌ను ప్లాన్ చేసుకుంటారు. ప్ర‌స్తుతం ఆన్‌లైన్ బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ ఉన్న‌ప్ప‌టికీ, భారీ మొత్తంలో జ‌రిగే లావాదేవీల‌కు బ్యాంక్‌కు వెళ్ల‌క త‌ప్ప‌దు. అయితే ఫిబ్ర‌వ‌రి నెల‌లో బ్యాంకుల సెల‌వులకు సంబంధించి రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివ‌రాలు వెల్ల‌డించింది.

ఆర్బీఐ వివ‌రాల ప్ర‌కారం.. ఫిబ్ర‌వ‌రిలో 10 రోజులు బ్యాంకుల‌కు సెల‌వులు రానున్నాయి. ఈ సెల‌వుల్లో కొన్ని రాష్ట్రాలు, ప్రాంతాల వారీగా వ‌ర్తిస్తాయి. నేష‌న‌ల్ బ్యాంక్ హాలీడేస్ మాత్రం దేశ‌వ్యాప్తంగా అమ‌ల‌వుతాయి.

ఫిబ్ర‌వ‌రి 5 (ఆదివారం) – వారాంత‌పు సెల‌వు
ఫిబ్ర‌వ‌రి 11 (శ‌నివారం) – రెండో శ‌నివారం.
ఫిబ్ర‌వ‌రి 12 (శ‌నివారం) – వారాంత‌పు సెల‌వు.
ఫిబ్ర‌వ‌రి 15 (బుధ‌వారం) – మ‌ణిపూర్‌లో లూయి న‌గాయినీ వేడుక‌.
ఫిబ్ర‌వ‌రి 18 (శ‌నివారం) – ప‌లు రాష్ట్రాల్లో మ‌హాశివ‌రాత్రి వేడుక‌లు.
ఫిబ్ర‌వ‌రి 19 (ఆదివారం) – వారాంత‌పు సెల‌వు, మ‌హారాష్ట్ర‌లో ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ జ‌యంతి.
ఫిబ్ర‌వ‌రి 20 (సోమ‌వారం) – అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌, మిజోరం ఆవిర్భావ దినోత్స‌వం.
ఫిబ్ర‌వ‌రి 21 (మంగ‌ళ‌వారం)- సిక్కింలో లొసార్ వేడుక‌.
ఫిబ్ర‌వ‌రి 25(శ‌నివారం) – నాలుగో శ‌నివారం.
ఫిబ్ర‌వ‌రి 26 ఆదివారం) – వారాంత‌పు సెల‌వు