బార్ల్కేస్‌లో 2000 మంది ఉద్యోగుల‌కు ఉద్వాస‌న‌!

పొదుపు చ‌ర్య‌ల్లో భాగంగా బ్రిట‌న్‌కు చెందిన ప్ర‌ఖ్యాత బార్ల్కేస్ బ్యాంక్.. ఉద్యోగుల‌ను కుదిస్తున్న‌ది. సుమారు రూ.100 (1 బిలియన్ పౌండ్లు) కోట్లు ఆదా చేయాల‌నే ల‌క్ష్యంతో ఉద్యోగాల్లో కోత పెట్టాల‌ని చూస్తున్న‌ది.

బార్ల్కేస్‌లో 2000 మంది ఉద్యోగుల‌కు ఉద్వాస‌న‌!
  • పొదుపు చ‌ర్య‌ల్లో భాగంగా ఉద్యోగాల్లో కోత‌

విధాత‌: పొదుపు చ‌ర్య‌ల్లో భాగంగా బ్రిట‌న్‌కు చెందిన ప్ర‌ఖ్యాత బార్ల్కేస్ బ్యాంక్.. ఉద్యోగుల‌ను కుదిస్తున్న‌ది. సుమారు రూ.100 (1 బిలియన్ పౌండ్లు) కోట్లు ఆదా చేయాల‌నే ల‌క్ష్యంతో ఉద్యోగాల్లో కోత పెట్టాల‌ని చూస్తున్న‌ది. బ్రిటిష్ బ్యాంక్ బ్యాక్ ఆఫీస్‌లో దాదాపు 2,000 ఉద్యోగాలను తగ్గించాల‌ని ప్ర‌తిపాద‌న‌లు సిద్ధంచేస్తున్న‌ది.


బ్యాంక్‌ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సీఎస్‌ వెంకటకృష్ణన్ నేతృత్వంలో బార్క్లేస్‌లోని మేనేజర్లు బ్యాంకు లాభాల‌ను మ‌రింత‌గా పెంచడానికి ప్రతిపాదనలను సమీక్షిస్తున్నారు. ఇందులో భాగంగా 1,500 నుంచి 2,000 ఉద్యోగాలకు కోత పడే అవకాశం ఉన్న‌ట్టు తెలుస్తున్న‌ది. బార్క్లేస్ ఇటీవలి సంవత్సరాలలో బోనస్‌ల‌లో కోత పెట్ట‌డం ద్వారా ఖర్చులను తగ్గించడానికి ప్రయత్నాలు చేసింది. అలాగే దాని రిటైల్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ వ్యాపారాల్లో ఉద్యోగాల‌ను కుదించే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్టు బ్యాంకు ఉద్యోగి ఒక‌రు వెల్ల‌డించారు.