పండుగ వేళ ఇల్లు జాగ్రత్త! తాళం వేసిన ఇండ్లే దొంగల‌ టార్గెట్‌..

విధాతద: సంక్రాంతి పండుగ వేళ అపార్ట్‌మెంట్లు, కాలనీలు ఖాళీ అవుతున్నాయి. ఇంటికి తాళాలు వేసి ఇంటిల్లిపాది ఊరి బాట పడుతున్నారు. బస్‌ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. రక్షణ ఏర్పాట్లు ఏమీ చేయ‌కుండా ఊరెళ్తె.., ఇదే అదనుగా దొంగలు తమ పని తాము కానిచ్చే అవకాశం ఉన్నదని నగర పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి దొంగల ముఠాలు నగరంలోకి చొరబడినట్లు అనుమానిస్తున్నారు. మేడ్చల్‌ జవహర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని దమ్మాయిగూడ ఆర్‌సీ ఎన్‌క్లేవ్‌లో తాళం […]

  • By: krs    latest    Jan 11, 2023 8:41 AM IST
పండుగ వేళ ఇల్లు జాగ్రత్త! తాళం వేసిన ఇండ్లే దొంగల‌ టార్గెట్‌..

విధాతద: సంక్రాంతి పండుగ వేళ అపార్ట్‌మెంట్లు, కాలనీలు ఖాళీ అవుతున్నాయి. ఇంటికి తాళాలు వేసి ఇంటిల్లిపాది ఊరి బాట పడుతున్నారు. బస్‌ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. రక్షణ ఏర్పాట్లు ఏమీ చేయ‌కుండా ఊరెళ్తె.., ఇదే అదనుగా దొంగలు తమ పని తాము కానిచ్చే అవకాశం ఉన్నదని నగర పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఇప్పటికే ఇతర రాష్ట్రాల నుంచి దొంగల ముఠాలు నగరంలోకి చొరబడినట్లు అనుమానిస్తున్నారు. మేడ్చల్‌ జవహర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని దమ్మాయిగూడ ఆర్‌సీ ఎన్‌క్లేవ్‌లో తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు చొరబడి ఐదు తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఇలాగే రాజేంద్రనగర్‌, ఇతర శివారు ప్రాంతాల్లో పది ఇండ్లల్లో చోరీలు జరిగాయి.

ఈ నేపథ్యంలో పండుగకు పోయే వారు ఇరుగుపొరుగు వారికి చెప్పి వెళ్లాలని, అపార్ట్‌మెంట్లవారైతే తప్పక సెక్యురిటీని నియమించుకొని వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. అలాగే.. అపార్ట్‌మెంట్లలో, ఇంటి ముందు సీసీ కెమెరాలు అమర్చుకోవాలని, బజార్లు, కూడళ్లలో సీసీ కెమెరాలు అమర్చుకున్నప్పుడే రక్షణ ఉంటుందని పోలీసులు అంటున్నారు.

సున్నితమైన ప్రాంతాల్లో నిరంతర నిఘా, బస్తీల్లో విసిబుల్‌ పోలీస్‌ ఉండేట్లు చూస్తున్నామని నగర పోలీస్‌ అధికారులు తెలిపారు. ఏది ఏమైనా… ఇంటి యజమానులు తగు జాగ్రత్తలు తీసుకొంటేనే మేలని పోలీసులు చెప్తుండటం విశేషం