యేసు క్రీస్తు వల్లే దేశం వృద్ది.. కరోనా తగ్గింది.. హెల్త్ డైరెక్టర్ గడల సంచలన వ్యాఖ్యలు
విధాత: తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాస్ రావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా నియంత్రణపై ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మనం అందించిన సేవలతో కరోనా అంతం కాలేదన్నారు. కేవలం యేసు క్రీస్తు దయవల్లే కరోనా తగ్గుముఖం పట్టిందన్నారు. భారతదేశ అభివృద్ధికి క్రైస్తవ మతమే కారణమని చెప్పారు. క్రైస్తవ మతమే మానవ మనుగడకు అభివృద్ధి నేర్పిందన్నారు. […]

విధాత: తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాస్ రావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా నియంత్రణపై ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మనం అందించిన సేవలతో కరోనా అంతం కాలేదన్నారు. కేవలం యేసు క్రీస్తు దయవల్లే కరోనా తగ్గుముఖం పట్టిందన్నారు. భారతదేశ అభివృద్ధికి క్రైస్తవ మతమే కారణమని చెప్పారు. క్రైస్తవ మతమే మానవ మనుగడకు అభివృద్ధి నేర్పిందన్నారు. ప్రపంచంలోనే భారతదేశం ఒక అభివృద్ధి దేశంగా నిలిచిందంటే అందుకు యేసు క్రీస్తునే కారణమని డాక్టర్ శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు.
యేసు క్రీస్తు వల్లే దేశం వృద్ది.. కరోనా తగ్గింది.. హెల్త్ డైరెక్టర్ గడల సంచలన వ్యాఖ్యలు https://t.co/N1smGJP6c9 pic.twitter.com/U5yiMC6f5U
— vidhaathanews (@vidhaathanews) December 22, 2022
రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన 8 మెడికల్ కాలేజీలను ముఖ్యమంత్రి కేసీఆర్ నవంబర్ 16వ తేదీన వర్చువల్ విధానంలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ప్రారంభోత్సవం తర్వాత కేసీఆర్‌ను కలిసిన శ్రీనివాసరావు.. పుష్పగుచ్చం ఇచ్చి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం కాళ్లు మొక్కారు. కార్యక్రమం ముగించుకుని వెళ్తుండగా కూడా మరోసారి కాళ్ల మీద పడ్డారు. అప్పుడు ఈ అంశం వివాదాస్పదమైన విషయం తెలిసిందే.